మందులు వాడేవారికి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఇలా చేయండి?

మనిషన్నాకా ఎప్పుడు కూడా ఏదో ఒక రోగం అనేది వస్తూనే ఉంటుంది.సపోజ్ పని ఒత్తిడి కారణంగా తలనొప్పి వచ్చిందే అనుకుందాం. తలనొప్పి తగ్గడానికి తలనొప్పిని తగ్గించే మాత్రలను వేసుకుంటాం. వాతావరణ మార్పుల కారణంగా జలుబు చేయడం సహజం. జులుబును తగ్గించుకోవడానికి కూడా మాత్రలను ఉపయోగిస్తూ ఉంటాం. తలనొప్పి మనల్ని ఎంతో బాధిస్తూ ఉంటుంది. అలాంటి తలనొప్పిని తగ్గించడానికి మనం మాత్రలను ఉపయోగిస్తున్నాం. ఈ మాత్రలు ఎంత శక్తివంతమైనవో మనం ఆలోచించాలి.తలనొప్పి మాత్రల వల్ల పెద్దగా దుష్ప్రభావాలు లేనప్పటికి కొందరూ అవసరం లేకుండానే మందులను ఉపయోగిస్తూ ఉంటారు. మన ఇంట్లో చిన్న పిల్లలకు కూడా ఏదో ఒక సమయంలో మాత్రలను ఇస్తూనే ఉంటాం. మందులను వాడడం వల్ల ఆ సమయంలో ఉపశమనం లభించవచ్చు. కానీ వాటి వల్ల వచ్చే దుష్ప్రభావాల గురించి మాత్రం ఎవరికి తెలియదు. 


అసలు ఆ మాత్రలను తట్టుకునే రోగ నిరోధక శక్తి మన శరీరానికి ఉందా.. అలా అని మందులను వాడకపోతే రోగం మరింత ముదిరే అవకాశం ఉంది. మందులను వాడితే దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి దీనికి ఏం చేయాలి. మందుల వల్ల దుష్ప్రభావాల బారిన పడకుండా ఉండాలంటే ముందులు వేసుకున్నప్పుడు కొబ్బరి నీటిని తాగడం చేయాలి.తరచూ మందులు వాడడం వల్ల వాటి వల్ల కలిగే దుష్ప్రభావాలను మనం అదుపు చేయలేము. మందులను ఎక్కువగా వాడే వారు కొబ్బరి నీటిని తీసుకున్నట్టయితే మందుల వల్ల కలిగే దుష్ప్రభావాలను దూరం చేసుకోవచ్చు. మందులు వాడే వారు తప్పనిసరిగా కొబ్బరి నీటిని తీసుకోవాలి. ఈ కొబ్బరి నీరు మనకు ఏ కాలంలోనైనా దొరుకుతుంది. కనుక ఈ కొబ్బరి నీటిని క్రమం తప్పకుండా రోజుకు ఒక గ్లాస్ చొప్పునైనా తీసుకోవాలి. మందులు వాడే వారు కచ్చితంగా శరీరానికి తగినంత కొబ్బరి నీరు అందేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: