చాలా మందికి కూడా టీ తాగడం అలవాటు. టీ తాగందే వారికి అసలు రోజు గడవదు. చాలా మంది తమ రోజును ఒక కప్పు టీతో ప్రారంభిస్తారు. కొందరికి ఉదయం టీ లేకపోతే తలనొప్పి మొదలవుతుంది.కానీ ఆ టీతో ఏదో ఒకటి తినడానికి ఇష్టపడతారు. కొందరు బిస్కెట్లను లేదా బ్రెడ్ ను టీ లో ముంచుకొని లొట్టలేసుకుంటూ తింటారు. మరికొందరూ పిండి పదార్థాలను కూడా వేసుకొని తింటారు. అయితే అలా చేయడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. టీలో పలు పదార్థాలను తినడం వల్ల కొత్త సమస్యలు మొదలవుతాయని పేర్కొంటున్నారు. కావున టీతో ఏయే పదార్థాలు తీసుకుంటే మీకు హానికరమో ఇప్పుడు తెలుసుకుందాం..టీతో శెనగపిండితో చేసిన పదార్థాలను తినడానికి చాలా ఇష్టపడతారు. అయితే శనగపిండితో చేసిన వాటిని టీతో కలిపి తీసుకుంటే, అది శరీరంపై చెడు ప్రభావం చూపుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ రెండు పదార్థాలను కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో అవసరమైన పోషకాల కొరత ఏర్పడి పొట్టకు సంబంధించిన సమస్యలు కూడా మొదలవుతాయి.


 ఇంకా బరువు సమస్య కూడా పెరుగుతుంది.చాలా మంది స్వీట్ బిస్కెట్లను టీతో పాటు తినడానికి ఇష్టపడతారు. తీపి బిస్కెట్లను టీతో కలిపి తీసుకుంటే షుగర్ రిస్క్ పెరుగుతుంది. శరీరంలో చక్కెర పరిమాణం ఎక్కువగా ఉంటే అది ముఖంపై మొటిమలకు దారితీస్తుంది. ఇది కాకుండా ముఖంపై ముడతలు కూడా ఏర్పడతాయి.చాలా మంది టీతో పాటు గుడ్డు తినడానికి ఇష్టపడతారు. ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల మీ ఆరోగ్యానికి చాలా హానికరం. ఎందుకంటే టీ ఆకుల్లో ఉండే టానిక్ యాసిడ్ గుడ్డులోని ప్రొటీన్‌తో కలిసినప్పుడు యాసిడ్‌లు ప్రోటీన్ సమ్మేళనాలను ఏర్పరుస్తాయి. ఇవి మలబద్ధకం, పైల్స్ ప్రమాదాన్ని పెంచుతాయి.కాబట్టి టీ తాగేటప్పుడు ఖచ్చితంగా ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. ఈ ఆహార పదార్ధాలు అస్సలు తినకండి. ఎల్లప్పుడూ కూడా సంపూర్ణ ఆరోగ్యంగా జీవించండి.

మరింత సమాచారం తెలుసుకోండి: