ఔషధ గుణాలు తులసి మొక్కలలో చాలానే ఉన్నాయి. ప్రతి ఒక్కరి ఇంట్లో సాంప్రదాయంగా ఉండనే ఉంటుంది ఈ మొక్క. తులసి మొక్కల ఆకులు, గింజల వల్ల కూడా పలు ఉపయోగాలు ఉన్నాయి. అంతేకాకుండా వీటి వల్ల రోగనిరోధక శక్తి బలపడి శరీరాన్ని చాలా ఆరోగ్యంగా ఉంచుతుంది. తులసి గింజలు అనేక వ్యాధులనుండి కూడా మనకి ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఈ గింజలలో ఎక్కువగా కొవ్వు ఆమ్లాలు, పొటాషియం ,కార్బోహైడ్రేట్లు విటమిన్ సి ,వంటివి పుష్కలంగా లభిస్తాయి. అయితే మనం ఈ విత్తనాలను సలాడ్ రూపంలో కూడా తీసుకోవచ్చు మధుమేహం నియంత్రించడానికి ఈ గింజలు చాలా ఉపయోగపడతాయి. అయితే తులసి గింజలు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి ఎక్కువగా ఉపయోగపడతాయని కొంతమంది నిపుణులు తెలియజేస్తున్నారు. ఇప్పుడు వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.


1). తులసి గింజలు తీసుకోవడం వల్ల ఎక్కువ బరువుతో ఇబ్బంది పడుతున్న వారు ఈ గింజలను తినడం వల్ల ఆకలి ఎక్కువగా వేయదు.

2). తులసి గింజలు తీసుకోవడం వల్ల మన రక్తంలో ఇంప్లమెంటరీ గుణాలు పుష్కలంగా లభిస్తాయి దీంతో రోగనిరోధక శక్తి బాగా పెంపొందించేలా చేస్తాయి.


3). తులసి గింజలను తరచూ సలాడ్ రూపంలో తీసుకోవడం వల్ల ఒత్తిడి నుంచి దూరం గా ఉండవచ్చు.


4). ఇక తులసి గింజలను ఎక్కువగా తీసుకుంటూ ఉండటం వల్ల అజీర్ణం గ్యాస్ సమస్యలు వంటి వాటిని దూరం చేసుకోవచ్చు.


5). తులసి గింజలలో అత్యధికంగా ఫైబర్ కంటెంట్ ఉండడం వల్ల చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచేలా చేస్తూ ఉంటుంది.


6). ప్రతిరోజు షుగర్ పేషెంట్లు వీటిని తింటూ ఉండడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలో తగ్గడమే కాకుండా వీక్ అయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుందట. అందుచేతనే ప్రతి ఒక్కరు కూడా తులసి ఆకులను కానీ గింజలను కానీ తినడం చాలా మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: