ఒకప్పుడు అడిగిన అప్పిచ్చేవారు కనిపించేవారు కాదు. కానీ ఇప్పుడు మాత్రం బ్యాంకులు అడగకపోయినా అప్పు ఇవ్వడానికి సిద్ధమవుతున్నాయి.  బ్రతిమిలాడి మరి లోన్స్ ఇస్తున్నాయి.  అదే సమయంలో లోన్స్ కట్టకపోతే ముక్కు పిండి మరియు వసూలు చేస్తున్నాయి. ఇటీవల కాలంలో ఎంతోమంది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడేందుకు లోన్స్ తీసుకుంటూన్నారు. తీసుకున్న మొత్తాన్ని కూడా ముక్కు పిండి మరి బ్యాంకులు వసూలు చేస్తున్నాయి.


 ఇలా నేటి రోజుల్లో జనాలు అటు బ్యాంకు నుంచి ఫైనాన్షియల్ సంస్థల నుంచి వస్తున్న లోన్స్ కి బాగా అలవాటు పడిపోయారు. లోన్ సంస్థలు రికవరీ సమయంలో ఎంత దారుణంగా వ్యవహరిస్తాయో అన్నదానికి సంబంధించిన ఘటనలు ఇటీవల సంచలనంగా మారిపోతున్నాయి. అయితే బ్రతికున్న వ్యక్తి దగ్గర నుంచి వసూలు చేయగలరు. కానీ ఒకవేళ లోన్ తీసుకున్న వ్యక్తి చనిపోతే ఎలా లోన్ ఎలా వసూలు చేస్తారు అన్నది అందులో ఉండే ప్రశ్న.



 ఒకవేళ రుణగ్రహిత చనిపోతే ఇక ఎవరు బాధ్యత వహించాలన్నది లోన్ రకంపై ఆధారపడి ఉంటుందట. హామీలేని వ్యక్తిగత లోన్ విషయంలో అయితే రుణగ్రహత చనిపోతే బకాయి చెల్లించాలని వారసులు లేదా అతని కుటుంబ సభ్యులను బ్యాంకులు అడగలేవు. ఎందు కంటే ఎలాంటి హామీ ఉండదు గనుక. ఇక వీటిని నిరార్ధక ఖాతాగా పేర్కొంటారు. అయితే లోన్ సహ దరఖాస్తుదారు లేదా సహ సంతకదారు ఉన్నట్లయితే వాళ్లే బకాయిలు చెల్లించాల్సి ఉంటుంది.


 క్రెడిట్ కార్డు లోన్ల వంటివి అన్ సెక్యూర్డ్ లోన్స్.. హామీలేని లోన్స్ కిందికి వస్తాయి అని చెప్పాలి. ఇటీవల కాలంలో అన్ సెక్యూరిడ్ లోన్స్ కి సంబంధించి ఇక ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ఇన్సూరెన్స్ తీసుకుంటూ ఉండడం గమనార్హం.ఎందుకంటే ఒకవేళ రుణగ్రహిత చనిపోయిన లోన్ మొత్తాన్ని కూడా ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది. ఇక ఇలాంటి లోన్లు తీసుకునె సమయంలో ఇన్సూరెన్స్ కోసం రుణ గ్రహీతలు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ హోమ్ లోన్ తీసుకున్న వ్యక్తి చనిపోతే లోన్ సహదరకాస్తుదారుగా ఎవరైనా ఉంటే వారు చెల్లించాలి. ఒకవేళ సహ దరఖాస్తుదారులు  చెల్లించకపోతే కుటుంబ సభ్యులు చట్టబద్ధ వారసులు లేదా గ్యారంటీ ఉన్న హామీదారిని బ్యాంకులు సంప్రదిస్తాయి. ఒకవేళ ఎవరు ముందుకు రాకపోతే లోన్ రికవరీ కోసం సంబంధిత ప్రాపర్టీని సీజ్ చేసి విక్రయిస్తాయి బ్యాంకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: