ఎక్కువగా అందరూ వాస్తుని ఏన్నో సంవత్సరాలుగా నమ్ముతూనే ఉన్నారు కొంతమంది మాత్రం వాస్తును ఎక్కువగా పట్టించుకోరు.. కేవలం ఒక మూఢనమ్మకంగా దీనిని పరిగణిస్తూ ఉంటారు. కానీ ఇల్లు నిర్మించేటప్పుడు ఇంటి స్థలాన్ని లేదా ఇల్లు కట్టించేటప్పుడు వాస్తుని పాటిస్తూ ఉంటాము. అయితే మన ఇంట్లో కూడా ఏ వస్తువు ఏ చోట ఉండాలి ఏ మూలన ఉండాలి అనే విషయాలలో చాలామంది ఎక్కువగా పట్టించుకుంటూ ఉంటారు. కొన్నిటిని కొన్నిచోట్ల ఇంట్లో పెట్టకూడదని భావిస్తూ ఉంటారు ఇలాంటివి వాస్తు నిపుణులు కూడా అప్పుడప్పుడు తెలియజేస్తూ ఉంటారు ఇంటి వాస్తును బట్టి ఏ వస్తువులు ఏ మూల ఉండాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం.




ప్రతి ఒక్కరు కూడా తమ ఇంట్లో కోరుకునేది ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా తమ జీవితాలను చాలా సుఖంగా గడవాలని అయితే కొన్నిసార్లు కలహాలతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు మరి కొన్నిసార్లు కుటుంబంలో కలతలు కూడా వస్తూ ఉంటాయి. మారుతున్న జీవన శైలి ప్రకారం.. కొన్నిటిని కొన్నిసార్లు నమ్మవలసి ఉంటుంది. అయితే కొన్ని పనులు చేయడం వల్ల చాలా ఇబ్బందులు ఉంటాయట.

1). ముఖ్యంగా ఎవరైనా టిఫిన్ కోసం చేసిన ఏదైనా పిండిని ఎక్కువ రోజులు నిల్వ ఉంచకూడదు. ఇది  వాస్తు ప్రకారం హాని కలిగించకుండానే శని రాహువులపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందట.

2). ఎక్కువమంది అన్ని వస్తువులను వంటగదిలో ఉంచుతూ ఉంటారు. చివరకు ఏమైనా ఆరోగ్యానికి ఉపయోగపడే మందులను కూడా ఉంచుతూ ఉంటారు. ఇలా చేయడం వాస్తు ప్రకారం చాలా తప్పట. ఇలా చేయడం వల్ల ఆ వ్యాధి తీవ్రంగా పెరిగే అవకాశం ఉంటుందని కొంతమంది నిపుణులు తెలియజేస్తున్నారు.


3). కొంతమంది ఇళ్లల్లో వంటగది లోనే పూజ మందిరాన్ని నిర్మిస్తూ ఉంటారు. ఇలా వాస్తు ప్రకారం చేయకూడదట అగ్నిదేవుడు అన్నపూర్ణమస్తానాన్ని కొలువై తీరుతాడు .అందుచేతనే ఈ రెండిటిని ఒకే చోట ఉంచకూడదు.

4). ఇక ఏవైనా పాత్రలు పగిలిన విరిగిన వాటిని వంట గదిలో ఉంచకూడదు.

5). ఇక ఎవరైనా పాదరక్షకములను బూట్లను బయటనే వదిలేయాలి ఇంటిలో వదలకూడదు.

మరింత సమాచారం తెలుసుకోండి: