ప్రస్తుత కాలంలో పోషకాహార లోపం వల్ల ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాంటి వాటిలో ముఖ్యంగా ఎముకల బలహీనత కూడా ఒకటి. మంచి ఆహారం తింటున్నప్పటికీ ఎముకలు మాత్రం బలంగా మెరుగుపడవు దీంతో కొన్ని సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అయితే ఇలాంటి వాటికి ముఖ్య కారణం మనం తిని ఆహారం కారణమని చెప్పవచ్చు. అందుకు మనం కొన్ని ఆహారాలను మార్చుకుంటే ఎముకల బలహీనతకు దూరం ఉండొచ్చని వైద్యులు తెలియజేస్తున్నారు.ఇప్పుడు ఆహార పదార్థాలు ఏంటో తెలుసుకుందాం.


1). చక్కెర ఉప్పును మన ఆహారంలో చాలా ముఖ్యమైనవి. ఇవి రెండు లేకుంటే ఆహారానికి రుచి ఉండదని చెప్పవచ్చు. అలా అని మనం ఎక్కువగా ఉప్పు పంచదార తీసుకోవడం వల్ల మన శరీరంలో క్యాల్షియం లోపిస్తుంది దీనివల్ల ఎముకలు చాలా బలహీనంగా మారుతాయి.


2). ఎక్కువమంది ఎప్పుడు పడితే అప్పుడు శీతల పానీయాలు తాగుతూ ఉంటారు. వాస్తవానికి శీతల పానీయాలలో ఎక్కువగా సోడా హానికరమైన రసాయనాలు కలుపుతూ ఉంటారట. అందుచేత వీటిని తాగడం వల్ల ఎముకలు చాలా దెబ్బతింటాయి దీంతో ఎముకలు కూడా బలహీన పడతాయి.


3). మాంసాహారాలను కూడా తరచూ ఎక్కువగా తిన్నట్లు అయితే ఇందులో ప్రోటీన్లు ఎక్కువగా ఉండడం వల్ల క్యాల్షియం లోపిస్తుంది దీంతో మన శరీరంలో పలుచోట్ల నొప్పులు మొదలవుతాయి.


4). ప్రతి ఒక్కరూ చేసేటువంటి తప్పులలో ప్రతిరోజు కాఫీ ఎక్కువసార్లు తాగడం. ఇందులో కెఫిన్ అనే పదార్థం ఉండడం వల్ల ఇది మన శరీరానికి చాలా హాని కలిగేలా చేస్తుంది. టీ కాఫీలు వంటివి ఎక్కువగా తాగినట్లు అయితే అందులో ఉండే కెఫెన్ మన శరీరంలో ఉండే క్యాల్షియంను చాలా వరకు తగ్గిస్తుంది దీనివల్ల ఎముకలు చాలా బలహీన పడతాయని వైద్యులు సూచిస్తున్నారు.


5). ఇక బీడీ, సిగరెట్ ,గుట్కా వంటివి ఎక్కువగా నమ్మడం వల్ల క్యాల్షియం లోపానికి గురికావాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: