ఈ లక్షణాలుంటే కొలెస్ట్రాల్ ఉన్నట్లే?

ఈ రోజుల్లో చాలామందిలో అధిక కొలెస్ట్రాల్ సమస్య అనేది సర్వసాధారణంగా మారింది. అదే సమయంలో శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుదల చాలా తీవ్రమైనదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.కొలెస్ట్రాల్ స్థాయి నియంత్రణలో లేకుంటే గుండెకు సంబంధించిన అనేక వ్యాధులు మిమ్మల్ని చుట్టుముడతాయి. దీని కారణంగా అనేక సమస్యలను ఎదుర్కొవాల్సి వస్తుందని చెబుతున్నారు. అంతేకాదు.. కొలెస్ట్రాల్ స్థాయి నియంత్రణలో లేకుంటే గుండెకు సంబంధించిన అనేక వ్యాధులు మిమ్మల్ని చుట్టుముడతాయి.అటువంటి పరిస్థితిలో మీరు కొలెస్ట్రాల్ స్థాయిని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. కొలెస్ట్రాల్ స్థాయి పెరిగినప్పుడు చర్మం కొన్ని సూచనలను ఇస్తుంది. అలాంటి వాటిని మరచిపోయి కూడా విస్మరించకూడదని సూచిస్తున్నారు. కొలెస్ట్రాల్ పెరిగితే.. చర్మంపై ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..అధిక కొలెస్ట్రాల్ కారణంగా మీ ముఖం మీద కళ్ళు, ముక్కు చుట్టూ చిన్న ఎర్రటి మచ్చలు వస్తాయి. అంతేకాకుండా మొటిమలు కూడా తీవ్రమవుతాయి. కావున ఇలాంటి వాటిని విస్మరించడం వల్ల చాలా ప్రమాదం ఏర్పడుతుందని పేర్కొంటున్నారు.


ముఖం మీద విపరీతమైన దురద కూడా అధిక కొలెస్ట్రాల్ లక్షణంగా పరిగణిస్తారు. చాలా కాలంగా ముఖంపై దురద, ఎర్రగా మారడం వంటి సమస్య ఉంటే నిర్లక్ష్యం చేయకండి.అధిక కొలెస్ట్రాల్ సమస్యలో చర్మం రంగు మారడం ప్రారంభమవుతుంది. దీని కారణంగా మీ చర్మం రంగు ముదురు రంగులోకి మారుతుంది. కళ్ల చుట్టూ కూడా చిన్న చిన్న వేడి పొక్కులు కనిపించడం ప్రారంభమవుతుంది. ఇలా ఉంటే మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరగడం వల్ల ముఖంపై ప్రిక్లీ హీట్ సమస్య ఏర్పడుతుంది. కానీ కొందరు మాత్రం సింపుల్‌గా పట్టించుకోకుండా ఉంటారు. అలా చేయడం హానికరంగా మారుతుంది. ముఖం మీద ప్రిక్లీ హీట్ అనేక కారణాల వల్ల కావచ్చు. అయితే దీనికి ప్రధాన కారణం అధిక కొలెస్ట్రాల్.ఈ లక్షణాలుంటే కొలెస్ట్రాల్ ఉన్నట్లే. కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి. ఏమైన సంకేతాలు కనిపిస్తే ఖచ్చితంగా డాక్టర్ ని సంప్రదించండి.

మరింత సమాచారం తెలుసుకోండి: