ప్రతి రోజూ కూడా చప్పట్లు కొట్టడం ద్వారా పొట్ట సమస్య, మెడ, నడుము నొప్పి, మూత్రపిండాలు, ఊపిరితిత్తుల సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఇది కాకుండా ఇది మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ప్రతిరోజూ వ్యాయామంలో చప్పట్లు కొడితే అద్భుత ప్రయోజనాలు కలుగుతాయి. రోజురోజుకూ వైద్యం ఖరీదుగా మారుతున్నప్పుడు పైసా ఖర్చు లేకుండా చప్పట్లు కొట్టే అలవాటు అలవర్చుకుంటే పలు అనారోగ్య సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు.ఉదయం రోజువారీ పనులు ముగించుకున్న తర్వాత 5 నిమిషాలు చప్పట్లు కొట్టడం అలవాటుగా పెట్టుకోండి. ఆ తర్వాత 5 నిమిషాలు పడుకుని, అవయవాలను రిలాక్స్ చేసి, శవాసనం చేయాలి. ఇలా చేయడం వల్ల పలు ఆరోగ్య సమస్యలు దూరమవుతాయట. శరీరంలోని కొవ్వు తగ్గిపోతుంది. రక్తపోటు సాధారణ స్థాయికి చేరుకుంటుంది. మధు మేహం నియంత్రణలోకి వస్త్ఉంది. కంటి చూపు మెరుగుపడుతుంది. శరీరం ఉత్తేజంగా మారుతుంది.


చప్పట్లు కొట్టడంలో ఆక్యుప్రెషర్ సూత్రం దాగి ఉంది. ఇందులో రెండు అరచేతులపై ఉన్న వేల పాయింట్లపై చప్పట్లు కొట్టడం వల్ల ఒత్తిడి ఏర్పడి రక్తప్రసరణ సాఫీగా జరగడమే ఆరోగ్య ప్రయోజనాలకు కారణమని వైద్యులు చెబుతున్నారు.రోజుకు కనీసం 5-6 నిమిషాలు చప్పట్లు కొట్టడం వల్ల పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఎలా పడితే అలా చప్పట్లు కొడితే ఈ ప్రయోజనాలు వర్తించవు. రెండు చేతులను మీ భుజాలకు ఎదురుగా పైకి లేపండి. చేతులను వీలైనంత వెడల్పుగా చాచి చప్పట్లు కట్టాలి. ఒక నిమిషం పాటు నెమ్మదిగా చప్పట్లు కొట్టండి. కాస్త అలసటగా అనిపిస్తే, మీ చేతులకు ఒకటిన్నర నిమిషాలు విశ్రాంతి ఇవ్వండి. ఆ తర్వాత మరో నిమిషం పాటు చప్పట్లు కొట్టండి. ఇలా 4-5 సార్లు చేయండి. ఒక వారంలో మీరు దానికి అలవాటు పడతారు. నిమిషానికి సుమారు 50 నుండి 100 క్లాప్స్ కొట్టవచ్చు. అంటే 5 నిమిషాల్లో 300 నుండి 500 సార్లు చప్పట్లు కొట్టవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: