చలికాలంలో గుండె పోటు రావచ్చు.. ఎందుకంటే?

చలి కాలం వచ్చేసింది.అందరినీ కూడా చలి బాగా వణికిస్తోంది. దీంతో పాటు వాయు కాలుష్యం కూడా బాగా పెరగడం మొదలైంది. వాతావరణం చల్లబడినప్పుడు, పొగమంచు ఇంకా అలాగే పొగ రెండూ కూడా బాగా పెరుగుతాయి.ఈ స్మోగ్ అనేది మన ఆరోగ్యానికి చాలా హానికరం. పొగమంచు వల్ల మన ఊపిరితిత్తులకు సంబంధించిన అనేక రకాల సమస్యలు వస్తాయి. అయితే ఇది ఊపిరితిత్తులకే కాదు మన గుండెకు కూడా చాలా ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పొగమంచు మన గుండె ఆరోగ్యానికి కూడా అనేక ప్రమాదాలను కలిగిస్తుంది. అమెరికా పరిశోధకులు జరిపిన ఆధ్యయనంలో పలు విషయాలు వెల్లడయ్యాయి.వాయు కాలుష్యానికి ఎక్కువ కాలం బహిర్గతం కావడం వల్ల గుండెపోటు, ఇతర గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. మనం పేలవమైన గాలిని పీల్చినప్పుడు గాలిలో ఉండే కాలుష్య కారకాలు మన ఊపిరితిత్తులు, గుండెకు రక్తప్రవాహంలోకి వెళ్లిపోతాయి. దీని కారణంగా మీరు గుండె సంబంధిత సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.


గాలిలో ఉండే కాలుష్య కారకాలు మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు రక్తం స్వేచ్ఛగా ప్రవహించడం కష్టమవుతుంది. దీని కారణంగా రక్తం గడ్డకట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శరీరంలోని ఇతర భాగాలకు చేరుకోవడానికి గుండె రక్తాన్ని వేగంగా పంప్ చేయడం వల్ల మన రక్తపోటు పెరగడం ప్రారంభిస్తుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. దీని కారణంగా గుండె వైఫల్యం కూడా సంభవించవచ్చు. ఇది మాత్రమే కాదు.. ఇప్పటికే ఏదైనా గుండె సమస్య ఉన్నవారికి గుండెపోటుకు గురవుతారు.మన శరీరంలో వాయు కాలుష్యం వల్ల కలిగే నష్టాన్ని ఎదుర్కొవడంలో సమతుల్య ఆహారాన్ని ఎంచుకోవడం సహాయకరంగా ఉంటుంది. సమతుల్య ఆహారంలో అవసరమైన విటమిన్లు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది మన శరీరం రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఇది కాకుండా మీరు మీ జీవనశైలిలో రెగ్యులర్ వ్యాయాయం అలవాటు చేసుకోవడం ఉత్తమం.

మరింత సమాచారం తెలుసుకోండి: