ఊబకాయం: తీసుకోవాల్సిన జాగ్రత్తలు ?

ఊబకాయం:  ఒక అధ్యయనం ప్రకారం వాయు కాలుష్యానికి గురయ్యే మధ్య వయస్సు మహిళల్లో అధిక కొవ్వు శాతం, తక్కువ లీన్ మాస్‌తో సంబంధం కలిగి ఉంటుందని పరిశోధకులు గుర్తించారు. వాయు కాలుష్యం కారణంగా శరీరంలో కొవ్వు 4.5 శాతం లేదా 2.6 పౌండ్ల వరకు పెరుగుతుంది. మధ్య వయస్కులైన మహిళల బరువు, వారి బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ), నడుము పరిమాణం, శరీర కొవ్వుల మధ్య సంబంధం ఉంటుందని అధ్యయనంలో బయటపడింది. ఈ ప్రమాదం నుంచి బయట పడాలంటే ముక్కును మాస్క్‌తో కప్పిపెట్టాలి. యూవీ రేస్‌ను నివారించేందుకు గాగుల్స్‌ ధరించాలి. లేదంటే గొడుగు పట్టుకెళ్ళాలి. వాయు కాలుష్యం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో దాదాపు వెళ్లకుండా ఉండటమే మేలు అని చెబుతున్నారు.ఒక వ్యక్తి తన శక్తికి మించి ఎక్కువ కేలరీల ఆహారం తీసుకుంటే శరీరంలో అదనపు కేలరీలను కొవ్వుగా నిలుపుకుంటుంది. 


ముఖ్యంగా బర్గర్‌లు, పిజ్జాలు, వేయించిన ఆహారం, ప్రాసెస్ చేసిన మాంసాలు, కుకీలు లేదా కేకులు, చక్కెర కలిపిన ఆల్కహాలిక్ డ్రింక్స్ వంటి వాటికి దూరంగా ఉండాలి.ఊబకాయం బరువు తగ్గించుకునేందుకు ఆహారంలో ఫైబర్ ఖచ్చితంగా  అధికంగా ఉండేలా చూసుకోవాలి.ఈ విషయంలో జాగ్రత్త వహించకపోతే తీవ్ర అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఖచ్చితంగా ఉంటుంది. గుండె జబ్బులు, మధుమేహం, అధిక రక్తపోటు, కొన్ని రకాల క్యాన్సర్‌లతో సహా వివిధ అనారోగ్యాల సమస్యల బారినపడే అవకాశం ఉంది. ఊబకాయం ఉన్నవారి శరీరంలో ఉండాల్సిన దానికంటే అదనంగా చెడు కొలెస్ట్రాల్ చేరుతుంది. దీని కారణంగా చర్మ సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది.కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి. రోజు కనీసం ఒక 30 నిముషాలు అయినా కూడా వ్యాయామం ఖచ్చితంగా తినండి. పైన చెప్పిన ఆహార నియమాలు ఖచ్చితంగా పాటించండి. ఊబకాయం బారిన పడకుండా ఎల్లప్పుడూ కూడా సంపూర్ణ ఆరోగ్యంగా జీవించండి.

మరింత సమాచారం తెలుసుకోండి: