జ్ఞాపకశక్తి: మెరుగయ్యే ఈజీ టిప్స్ ?

జ్ఞాపకశక్తి:  ఈ రోజుల్లో చాలా మందికి కూడా జ్ఞాపక శక్తి అనేది తగ్గిపోతుంది. జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకుంటే జ్ఞాపకశక్తిని కాపాడుకోవచ్చు.ప్రతి రోజూ కూడా ఖచ్చితంగా 30 నిమిషాలు వ్యాయామం చెయ్యండి. వ్యాయామం చెయ్యడం వల్ల రోజంతా బాగా ఉల్లాసంగా ఇంకా అలాగే ఉత్సాహంగా ఉంటారు.అలాగే ప్రతి రోజూ కూడా వ్యాయామంతో పాటు ధ్యానం చేయడం వల్ల ఆరోగ్యంగా ఉండటమే కాకుండా జ్ఞాపకశక్తిని చక్కగా ఉంచుతుంది. యోగా, ధ్యానం మీ జ్ఞాపకశక్తిని మరింత మెరుగుపరచడంలో ప్రభావవంతంగా ఉన్నాయని రుజువు చేస్తుంది.మీరు జ్ఞాపకశక్తిని మెరుగుపరచాలనుకుంటే.. ప్రతి రోజు కొన్ని పజిల్స్ పూరించండి. మెదడుకు ఇది గొప్ప వ్యాయామం. ఈ వ్యాయామం మెదడును చురుకుగా ఉంచుతుంది. చెస్, బోర్డ్ గేమ్స్ ఆడటం వల్ల మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. రోజుకు 8 గంటలు నిద్రపోయే విధానాన్ని నిర్వహించడం మెదడును ఛార్జ్‌గా ఉంచడంలో సహాయపడుతుంది.పసుపు తీసుకోవడం ఆరోగ్యానికి,మెదడుకు రెండింటికీ ఉపయోగపడుతుంది. పసుపులో కర్కుమిన్ అనే క్రియాశీల పదార్ధం ఉంటుంది. 


ఇది మెదడులోకి ప్రవేశించి.. అక్కడి కణాలకు శక్తివంతం చేస్తుంది. ఇది మెదడు ఆరోగ్యానికి ఉపయోగపడే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనం. పసుపును పాలతో కలిపి వాడితే మేలు జరుగుతుంది.చాలా మంది ఉదయం మేల్కొవడంతోనే కాఫీని తీసుకుంటారు. ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల జ్ఞాపకశక్తి చెక్కుచెదరకుండా ఉంటుంది. కాఫీలో రెండు ప్రధాన భాగాలు ఉన్నాయి. కెఫిన్, యాంటీఆక్సిడెంట్లు, ఇవి మెదడును ఆరోగ్యవంతంగా చేయడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయని రుజువు అయ్యింది. కాఫీలో ఉండే కెఫిన్ మెదడుపై చాలా సానుకూల ప్రభావాలను చూపుతుంది. ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. మానసిక స్థితి మెరుగుపడుతుంది. ఎక్కువ సేపు కాఫీ తాగడం వల్ల పార్కిన్సన్స్, అల్జీమర్స్ వంటి నరాల సంబంధిత వ్యాధుల ముప్పు కూడా తగ్గుతుంది. మనం తీసుకునే కాఫీ ఫిల్టర్ కాఫీ.. స్వచ్చమైనది మాత్రమే ఇలా ఉత్సాహాన్ని ఇస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: