గురక సమస్య చాలా మందికి కూడా ఉంటుంది.గురక పెడుతున్నప్పుడు నోరు మూసి గురక పెడితే నాలుకలో సమస్య ఉన్నట్టు, నోరు తెరిసి మూడపెడితే గొంతులో సమస్య ఉన్నట్టు గుర్తించాలి. పడుకునే ముందు నీటిలో యాలకుల పొడిని కలుపుకుని తాగినా కూడా గురక నుండి ఉపశమనం కలుగుతుంది. తేనెలో, ఆలివ్ నూనెను కలిపి పడుకునే ముందు తీసుకున్నా కూడా గురక తగ్గుతుంది. ఈ చిట్కాలను పాటించడం వల్ల గురక సమస్య నుండి మనం సత్వర ఉపశమనాన్ని పొందవచ్చు.కొన్ని రకాల ఆయుర్వేద మందులను ఉపయోగించి కూడా గురకను తగ్గించుకోవచ్చు.వీటిలో ఉండే ఔషధ గుణాలు ముక్కు దిబ్బడను తగ్గిస్తాయి. ఇది గురకను ఆపుతుంది. గురకతో బాధపడే వారు వేపరైజర్ కు పెప్పరమెంట్ వంటి తైలాలను వాడాలి. ఇవి గాలి వెళ్లే మార్గాలను సులభం చేసి సైనస్ ప్రాంతాలను ఖాళీ చేసి సుఖంగా నిద్రపోయేలా చేస్తుంది. అలాగే పడుకునేటప్పుడు దిండ్లను సరిగ్గా అమర్చుకుని పడుకోవాలి. పడుకునేటప్పుడు తల పైకి ఉండేలా చూసుకుని పడుకోవాలి. ఇలా చేయడం వల్ల శ్వాస మార్గాలు తెరుచుకుని శ్వాస సులభం అవుతుంది. దీంతో గురక రాకుండా ఉంటుంది.దిండు మరీ వత్తుగా కానీ, గట్టిగా కానీ వాడుకోకూడదు. గురకతో ఇబ్బంది పడే వారు ప్రాణాయామం నేర్చుకోవాలి. ఇవి శ్వాసను అదుపు చేయడంలో సహాయపడతాయి. అంతేకాకుండా ప్రాణాయామం పలు రకాల నిద్రలేమి సమస్యలను కూడా తగ్గిస్తుంది.


 నాలుక, గొంతుకు సంబంధించిన వ్యాయామాలు చేయాలి. నాలుక, గొంతు కండరాలు బాగుంటే గురక రాకుండా ఉంటుంది. కండరాలు వదులైనప్పుడే మనం ఎక్కువ గురక పెడతాం.నాలుక, గొంతు కండరాలు గట్టిగా ఉంటే మనకు గురక రాకుండా ఉంటుంది. అలాగే మద్యం, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. పడుకోవడానికి ముందు కనీసం రెండు గంటల వరకు ఎటువంటి మత్తు పదార్థాలను, మద్యాన్ని తీసుకోకూడదు. ఇది గొంతులో గాలి మార్గాన్ని వదులు చేసి శ్వాసకు అడ్డంకం కలిగిస్తాయి.వీలైనంత త్వరగా బరువు తగ్గాలి. గురకతో బాధపడే వారు వారు పడుకునే మంచం కింద తల వైపు రాయిని లేదా చెక్కను ఉంచి తల భాగం పైకి ఉండేలా చూసుకోవాలి. గురకను తగ్గించే పద్దతుల్లో ఇది ఒకటి. అదేవిధంగా ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రం చేసుకోవాలి. అలర్జీని కలిగించే పుప్పొడి, జంతువుల వెంట్రుకలు, దుమ్ము మొదలైనవి గొంతులో అడ్డం సృష్టించి గాలిని అడ్డగిస్తాయి. ఇవి గురకకు దారి తీయవచ్చు. ఇంట్లో ఉండే ఎయిర్ ఫిల్టర్ ను తరచూ మారుస్తూ ఉండాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: