ఈ మధ్యకాలంలో చాలామందికి  నెలసరి సమయంలో అధిక ఋతుస్రావం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు.అవుతుంటుంది. దానికోసం  ఎన్ని ఇంగ్లీషు మందులు వాడినా రుతుస్రావం అవుతూనే ఉంటుంది..నెలసరి సమయం లో బయటికెళ్ళడానికే కూడా భయపడుతుంటారు.అయితే, సమస్య నుండి తప్పించుకోవడానికి మన ఆహారపు పద్ధతుల్లో  మార్పుల ద్వారా ఈ సమస్యని కంట్రోల్ లోకి  తీసుకురావొచ్చు. మందుల షాపులో దొరికే మందుల ద్వారా, ఒక్కోసారి సరైన విశ్రాంతి ద్వారా కూడా తేడా కనిపిస్తుంది. ఇవన్నీ పాటించినా కూడా మార్పు కనిపించకపోతే, డాక్టర్ నీ మీట్ అవ్వడం చాలా మంచిది. ఆహారంలో తగిన మార్పులు ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం..


ఆహారంలో మార్పులు

1. నీళ్ళు ఎక్కువ తాగండి
 నెలసరి సమయంలో అధిక రక్తస్రావం  ఉంటే మీకు చాలా రక్తం పోతోందని దాన్ని సరి చేయాలంటే రోజూ తాగే నీటి కంటే రెండు నుంచి మూడు లీటర్లు  నీరు అధికంగా తాగాలి. అదే విధంగా ఉప్పు వేసిన వస్తువులు తక్కువగా వాడాలి.


2. విటమిన్-సీ ఫుడ్స్..
 అధిక రక్తస్రావం వల్ల తీరంలో రక్తం శాతం తగ్గుతూ వస్తుంది. ఇలాంటప్పుడు వి టమిన్-సీ అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. దీనివల్ల శరీరం ఐరన్‌ని బాగా అబ్జార్బ్ చేసుకుంటుంది. ఐరన్ సరిగ్గా ఉండడం వల్ల రక్తహీనత రాకుండా సహాయయపడుతుంది.

3. ఐరన్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్..
బ్లీడింగ్ అవుతున్నప్పుడు శరీరంలో ఐరన్‌ ని కూడా కోల్పోతుంది. ఐరను శాతం తగ్గడం వల్ల తగ్గితే ఎనీమియా,నీరసం, కళ్ళు తిరగడం, శరీరం పాలిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

విటమిన్ టాబ్లెట్స్ వాడటం వల్ల రక్తహీనత  రాకుండా జాగ్రత్తగా ఉండవచ్చు . విటమిన్-సీ బ్లీడింగ్ ని తగ్గిస్తుంది.ఐరన్ లోపం వల్ల కూడా అధిక రక్తస్రావం అయ్యే అవకాశం ఉంటుంది. అయితే, వీటి వల్ల సాధారణంగా ఉండే ఇతర దుష్ప్ర్బవాలు,బ్లోటింగ్, వికారం, మూడ్ స్వింగ్స్, బరువు పెరగడం, తల నొప్పి వంటివి వస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: