మీ ఇంట్లో చెడు వాసన రాకుండా మంచి సువాసన రావాలంటే తులసి, మరువం, పుదీనా, కొత్తిమీర, వంటి మొక్కలను ఇండోర్లో పెంచుకోండి. వీటి వల్ల మంచి సువాసన వస్తుంది.తొట్లలో  లెమన్ గ్రాస్ ను నాటి పెట్టుకోవచ్చు. దీన్ని ముఖద్వారం వద్ద వుంచడం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది. దాంతో ఇంట్లో ఒక మంచి సువాసన చాలా నేచురల్ గా ఉంటుంది.ఇంకా అలాగే దాల్చిన చెక్క వల్ల మీ ఇంట్లో ఒక అందమైన సహజమైన ప్రకృతి సిద్దమైన వాసన అనేది వెదజల్లుతుంది.మరి ఈ వాసన మీ ఇంట్లో ఉండిపోవాలంటే, దాల్చిన చెక్క పొడి కానీ, లేదా దాల్చిన చెక్కను కానీ ఇంట్లో కిటీకీల దగ్గర లేదా డోర్ దగ్గర దాన్ని పెట్టాలి.ఇంకా అలాగే సిట్రస్ జాతికి చెందిన ఏ రకం పండ్లైనా సరే మీ ఇంట్లో అనేక రకాల సువాసనలు వెదజల్లుతాయి.. ఎందుకంటే ఆ పండ్ల స్వభావమే అంత. ఆరెంజ్ లేదా నిమ్మను ఒక గుండు సూదితో గుచ్చి ఆ కాయ మొత్తం అక్కడక్కడ గుచ్చి వంటగదిలో ఉంచండి .


అంతే ఇళ్ళంతా ఖచ్చితంగా మంచి వాసనతో నిండిపోతుంది.ఇంకా అలాగే ఇంట్లో సువాసనగల కొవ్వొత్తులు, అగరబత్తీలు, చందనం ఇంకా అలాగే అగరబత్తీలను ఖచ్చితంగా వెలిగించండి. ఇది మీ ఇంటికి మంచి సువాసన రావడానికి చాలా బాగా సహాయపడుతుంది. ఇంకా అలాగే ఇంటికి తాజా, చక్కని సువాసన ఇవ్వడానికి చాలా పుష్కలంగా  నూనెలు అందుబాటులో ఉన్నాయి. రోజ్మేరీ, నిమ్మకాయ, పిప్పరమింట్  ఇంకా దాల్చిన చెక్క నారింజ వంటి నూనెలతో కూడిన ముఖ్యమైన నూనె డిఫ్యూజర్‌ను వాడండి. ఇది మీ ఇంటిని నెలల తరబడి ఎంతో సువాసనగా ఉంచుతుంది.ఇక మీ ఇంటిని సువాసనగా ఉంచేందుకు ఇప్పుడు మార్కెట్‌లో ఎన్నో రకాల సువాసనగల వస్తుసామాగ్రి అందుబాటులో ఉన్నాయి. వీటిని ఖచ్చితంగా కొనండి, కొని మీ ఇంట్లో ప్రతి మూలలో ఉంచండి. ఇది మీ ఇంటి నుండి చెడు వాసనలను చాలా ఈజీగా తొలగించి, సువాసన భరితంగా మార్చేందుకు ఎంతగానో సహాయపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: