పొట్ట చుట్టూ కొవ్వును కరిగించుకోవడానికి జిమ్ములని డాన్స్ క్లాస్ లని, ప్రత్యేకమైన ఫుడ్ తింటూ అధికంగా ఖర్చు చేస్తూ ఉంటారు.కాని జీరో ఖర్చుతో, మనం రోజూ తినే ఆహారాలతోనే సులభంగా బరువు తగ్గొచ్చని ఆహార నిపుణులు కొన్ని చిట్కాలను సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

 పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం వలన అలా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.అధిక బరువు పెరగడం వల్ల ఊబకాయం, గుండె పోటు సమస్యలు అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. శరీర బరువు తగ్గించుకోవడానికి, ప్రత్యేకమైన ప్రోటీన్ ఫుడ్ తింటూ,డైట్ పాటిస్తూ ఉంటారు. ఈ ఫుడ్డు కు చాలా ఖర్చు అవసరము. కానీ మన రోజువారి ఆహారాలతోనే అధిక బరువును తగ్గించుకోవచ్చు.


సోరకాయ:
సోరకాయలో విటమిన్ ఎ, విటమిన్ సి, మెగ్నీషియం పొటాషియం, జింక్ కాల్షియం, ఐరన్ అధిక పరిమాణంలో లభిస్తాయి. దీనిని తరచుగా తీసుకోవడం వల్ల, మన శరీరానికి వాటర్ కంటెంట్ బాగా అంది తొందరగా ఆకలి వేయదు. దీంతో అధిక బరువు ఈజీగా తగ్గవచ్చు.

బాదం..
 పాదం ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇందులో ఉన్న ఫైబర్ అన్నం తిన్న ఆహారాన్ని ఈజీగా జీర్ణం అవ్వడానికి సహాయం చేస్తుంది. దీంతో చెడు కొలెస్ట్రాల్ బయటికి వెళ్లిపోయి, నడుము చుట్టూ ఉన్న కొవ్వును కరిగిస్తుంది. అంతేకాక బాదంలో ప్రొటీన్, విటమిన్ ఇ, ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు  దరిచేరవు.

పెరుగు:
పెరుగులో విటమిన్ B2, విటమిన్ B12, మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం వంటివి పుష్కళంగా ఉంటాయి. అందువల్ల బరువు తగ్గే క్రమంలో,పెరుగుతో తయారు చేసిన ఆహారాలు తింటే బరువు ఈజీగా తగ్గుతారని ఆహారనిపుణులు సూచిస్తున్నారు.
నిమ్మకాయ అంతేకాకుంగా ఈ నిమ్మ రసాన్ని గ్రీన్‌ టీల్లో వినియోగిస్తే సులభంగా బెల్లీ ఫ్యాట్‌ నుంచి కూడా ఉపశమనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: