లవంగాలు ఆరోగ్యానికి చాలా మంచివి.లవంగాలు ఒక మంచి మసాలా దినుసుగానే మనందరికి తెలుసు. కానీ దీనిలో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయని వీటిని వాడడం వల్ల మనం ఖచ్చితంగా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని మనలో చాలా మందికి తెలియదు. వీటిల్లో యాంటీ ఇన్ ప్లామేటరీ గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయి.శరీరంలో వచ్చే నొప్పులను, కీళ్ల నొప్పులను ఇంకా అలాగే పంటి నొప్పులను తగ్గించడంలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. అలాగే తలలోని ద్రవాలను తొలగించి తలనొప్పిని తగ్గించడంలో సైంధవ లవణం మనకు ఎంతగానో సహాయపడుతుంది. ఇందు కోసం ముందుగా ఒక రోట్లో 8 లవంగాలను తీసుకోవాలి.వీటిని ఒక రోట్లో వేసి బాగా మెత్తగా చేసుకోవాలి. తరువాత దీనిలో పావు టీ స్పూన్ సైంధవ లవణం వేసి దానిని మెత్తని పొడిగా చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పొడిని మీరు ఒక గిన్నెలోకి తీసుకోవాలి.


ఆ తరువాత ఇందులో తగినన్ని నీళ్లు వేసి ఒక ముద్దలా చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని గోరు వెచ్చని ఆవు పాలల్లో లేదా గేదె పాలల్లో వేసి బాగా కలపాలి.తలనొప్పిగా ఉన్నప్పుడు ఇలా పాలను తయారు చేసుకుని తాగడం వల్ల చాలా ఈజీగా తలనొప్పి తగ్గుతుంది.తలనొప్పితో ఎక్కువగా బాధపడుతూ ఉంటే మనం తీసుకునే ఆహారంలో వెన్న, చాక్లెట్ ఇంకా అలాగే మాంసం వంటి పదార్థాలను తొలగించాలి. అలాగే విటమిన్ బి12, సి, డి, మాంసకృత్తులు ఇంకా క్యాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. మెంతులు, క్యాలీప్లవర్, క్యాబేజి ఇంకా అలాగే ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా తలనొప్పి సమస్య రాకుండా ఉంటుంది.ఇంకా అలాగే ప్రతిరోజూ తగినన్ని నీళ్లు తాగడం కూడా చాలా అవసరం.ఇంకా అలాగే ప్రతిరోజూ 8 గంటల పాటు తప్పకుండా నిద్రపోవాలి. ఈ టిప్స్ పాటించడం వల్ల సహజంగానే మనం తలనొప్పిని ఈజీగా తగ్గించుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: