మొటిమలు, మచ్చలు, ముడతలు ఇంకా అలాగే ముఖం నల్లగా మారడం వంటి ఎన్నో రకాల సమస్యలతో బాధపడే వారి సంఖ్య ప్రస్తుత కాలంలో చాలా ఎక్కువవుతుంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ కూడా ఎక్కువగా ఈ సమస్యలతో సతమతమవుతున్నారు. ఒక చక్కటి ఇంటి చిట్కాను వాడి మనం ఈ సమస్యల నుండి చాలా ఈజీగా బయటపడవచ్చు.ఇక మీరు ఒక గిన్నెలో ఒక టీ స్పూన్ శనగపిండిని తీసుకోని ఆ తరువాత ఇందులో పావు టీ స్పూన్ పసుపును, 2 టీ స్పూన్ల పెరుగును వేసి అన్నీ బాగా కలపాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని మీ ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి.దీనిని ముఖం పై  రాస్తూ సున్నితంగా మర్దనా చేసుకోవాలి.ఆ తరువాత ఈ ఫేస్ ప్యాక్ పూర్తిగా ఆరిన తరువాత నీటితో బాగా శుభ్రం చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖంతో పాటు మెడకు కూడా అప్లై చేసుకోవచ్చు.ఇక మీరు ఆ చిట్కాను క్రమం తప్పకుండా వారానికి రెండు సార్లు పాటించడం వల్ల ముఖం ఎండ వల్ల నల్లగా మారిన చర్మం తెల్లగా మారడంతో పాటు అలాగే మీ చర్మం మంచి నిగారింపును సొంతం చేసుకుంటుంది.


ఈ టిప్ తయారీలో వాడిన పదార్థాలన్నీ కూడా సహజ సిద్దమైనవే. వీటిని వాడటం వల్ల చర్మం పై ఉండే మృత కణాలు తొలగిపోతాయి. వృద్ధాప్య ఛాయలు కూడా మన దరి చేరకుండా ఉంటాయి. ఇంకా అలాగే మొటిమలు, మచ్చలు వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే ఎండవల్ల నిర్జీవంగా మారిన చర్మం కూడా తేమను సొంతం చేసుకుంటుంది. ఈ టిప్ ని వాడడం వల్ల చాలా తక్కువ ఖర్చులో ఎటువంటి దుష్ప్రభావాల బారిన పడకుండా ముఖాన్ని మీరు చాలా అందంగా మార్చుకోవచ్చు. ఇంకా అలాగే బయట దొరికే క్రీములను, ఫేస్ వాష్ లను, స్క్రబర్ లను అలాగే ఇతర సౌందర్య ఉత్పత్తులను చాలా ఎక్కువ ధరలకు కొనుగోలు చేసి వాడడానికి బదులుగా ఇలా ఇంట్లోనే పదార్థాలతో మన ముఖ సౌందర్యాన్ని చాలా ఈజీగా పెంచుకోవచ్చు. ఇంకా ఈ టిప్ ని క్రమం తప్పకుండా పాటించడం వల్ల చాలా తక్కువ సమయంలోనే మన ముఖం చాలా కాంతివంతంగా తయారవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: