ఇప్పుడున్న జీవనశైలి, ఆహారఅలవాట్ల వల్ల జుట్టుకు ఎన్నో సమస్యలు వస్తున్నాయి. సాధారణంగా వచ్చే జుట్టుసమస్యలకు అన్నింటికీ..కొన్ని రకాల నూనెలు వాడటం వల్ల తగ్గించుకోవచ్చని వైద్యనిపుణులు పరిశోధనలు చేసి మరీ నిరూపించారు. కొందరైతే జుట్టుకు నూనె పెట్టుకోవడం అంత మంచి పద్ధతి కాదని వాగ్వాదం చేస్తూంటారు. కానీ కొన్నిరకాల నూనెలలో ఉన్న పోషకాలు మన జుట్టుని దృఢంగా, ఒత్తుగా పెరగడానికి సహాయపడతాయి.అలాంటి నూనెలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

కొబ్బరినూనె..
కొబ్బరినూనెను కొద్దిగా వేడి చేసి, గోరు వెచ్చగా వున్నప్పుడే తలకు మర్దన చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల ఇందులో వున్న పోషకాలు జుట్టురాలడం , చుండ్రు వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి.

లావేండర్ ఆయిల్..
లావెండర్ ఆయిల్ ఎలాంటి జుట్టుకైనా అనువైన నూనె. ఇందులోని యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు తలలో ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతాయి. లావెండర్ ఆయిల్ మీ తలలో చుండ్రు నివారించి, ఒత్తైన జుట్టు పొందడానికి మంచి నివారిణిగా పని చేస్తుంది.

బాదాంఆయిల్..
ఈ నూనెను జుట్టుకు తరుచూ సున్నితంగా మర్దన చేయడం వల్ల తలలోని ఆయిల్ గ్రంథులు మంచినూనెను ఉత్పత్తి చేయడానికి సహాయపడతాయి. ఇందులోని విటమిన్ ' ఈ 'జుట్టు ఆరోగ్యంగా, కాంతివంతంగా పెరగడానికి ప్రోత్సహిస్తుంది. జుట్టురాలడం నివారిస్తుంది.

రోజ్మెరి ఆయిల్..
 జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి ఒక గొప్ప మార్గం అని చెప్పవచ్చు.రోజ్మేరీఆకులను కొద్దిగా తీసుకొని కొబ్బరినూనెలో వేసి బాగా మరిగించి జుట్టుకు రాయడం వల్ల,జుట్టు నల్లగా, మెత్తగా నిగనిగాలాడుతుంది.జుట్టు కుదుళ్లు బలపడి సహజంగా దట్టమైన జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.

క్యారెట్ ఆయిల్..
ఒత్తైన మరియు ఆరోగ్యకరమైన జుట్టు పొందడానికి, క్యారెట్ ఆయిల్ చాలా బాగా ఉపయోగపడుతుంది.క్యారెట్ ఆయిల్లోని కెరోటిన్ మరియు యాంటీఆక్సిడెంట్లు జుట్టు పెరుగుదలకు దోహదపడతాయి.

లెమన్ ఎసెన్షియల్ ఆయిల్..
నిమ్మకాయలో ఇన్ఫెక్షన్స్ నివారించే గుణాలు అధికంగా ఉంటాయి. మరియు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.దీనిని తరుచు వాడటం వల్ల పొడి జుట్టును మృదువుగా చేస్తుంది. మరియు ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చుండ్రును నివారిస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: