ఈ రోజుల్లో చాలా మంది కూడా చిన్న ఏజ్ లోనే గుండె పోటు సమస్యని ఎదురుకుంటూ ఉన్నారు. దానికి కారణం శారీరక శ్రమ లేకపోవడం.ఈరోజుల్లో శారీరక శ్రమ లేకపోవడం వల్ల చాలా ఎక్కువ మంది గుండె పోటుకు గురవుతున్నారని ఆరోగ్య నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. అందుకే వైద్యులు కచ్చితంగా శారీరక వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు.అయితే వ్యాయామానికి బెస్ట్ మెడిసిన్ నడకే. ప్రతిరోజూ పొద్దున్నే నడవడం వల్ల గుండె పనితీరు మెరుగపడడమే కాకుండా గుండెపోటు వచ్చే అవకాశాలు చాలా మేరకు తగ్గుతాయట.అందుకే నడక వల్ల గుండె పోటు వచ్చే అవకాశాలు తగ్గుతున్నాయో? లేదో? ఇప్పుడు మనం తెలుసుకుందాం..ప్రతిరోజూ కూడా 6000 నుంచి 9000 అడుగులు నడిచే వారి కంటే 2000 అడుగులు మాత్రమే నడిచే వారికి గుండె పోటు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయట. అంతే కాదు రోజుకు మూడు నుంచి నాలుగు మైళ్లు నడిచే వారు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


18 ఏళ్ల కంటే ఎక్కువ ఉన్న దాదాపు 20152 మందిని ఆరు సంవత్సరాల పాటు వారి ఆరోగ్యాన్ని పరిశోధించి దాదాపు ఎనిమిది అధ్యయనాలు చేసి నడక వల్ల గుండె పని తీరు మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుసుకున్నారు.అయితే 60 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సున్న పెద్దలు ఎక్కువగా నడిస్తే గుండె సంబంధ వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా తక్కువగా ఉంటుంది. అయితే యుక్త వయస్సున్న వారు ఎక్కువగా నడిస్తే గుండె పోటు ప్రమాదం రాదనే విషయం ఎక్కడా కూడా నిరూపితం కాలేదు. సాధారణంగా గుండె సంబంధిత వ్యాధులు వృద్ధాప్యం వల్ల వచ్చే ఇతర సమస్యలపై కూడా ఆధారపడి ఉంటాయని తేలింది. ముఖ్యంగా ఈ వయస్సులో వచ్చే అధిక రక్తపోటు, ఊబకాయం ఇంకా అలాగే మధుమేహం వంటి ప్రధాన సమస్యల నేపథ్యంలో  గుండె పోటు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అయితే ఇందులో మనం గమనించాల్సిన విషయం ఏంటంటో కొంత మంది బాగా ఎక్కువగా నడిస్తే గుండెకు మంచి జరుగుతుందని అనుకుంటారు. అయితే దీన్ని నిరూపించడడానికి ఎలాంటి ఆధారాలు లేవు.కాబట్టి నార్మల్ గా నడవండి. కఠినంగా వ్యాయామాలు చేయకండి.

మరింత సమాచారం తెలుసుకోండి: