నిమ్మరసం మన ఆరోగ్యానికి చాలా విధాలుగా మేలు చేస్తుంది.ఇంకా నిమ్మరసంలో మన శరీరానికి అవసరమయ్యే చాలా పోషకాలతో పాటు చాలా ఔషధ గుణాలు కూడా దాగి ఉన్నాయి. నిమ్మరసాన్ని వాడడం వల్ల మనం ఎల్లప్పుడూ కూడా చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.సాధారణంగా మనం నిమ్మరసాన్ని తీసుకున్న తరువాత నిమ్మ తొక్కలను బయట పాడేస్తూ ఉంటాం.కొందరైతే ఈ నిమ్మ తొక్కలను చర్మ శుద్ది కోసం ఇంకా అలాగే సున్నిపిండి తయారీలో ఉపయోగిస్తూ ఉంటారు.బయటి చర్మ సంరక్షణ కొరకు మాత్రమే కాకుండా అంతర్గతంగా తీసుకోవడం వల్ల కూడా మనం చాలా ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఇక నిమ్మరసాన్ని తీసుకున్న తరువాత నిమ్మతొక్కలను పడేయకుండా వాటిని ముక్కలుగా చేసి ఎండబెట్టాలి. ఆ తరువాత వీటిని ఒక జార్ లో వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. తరువాత ఈ పొడిని వేయగా వచ్చిన మెత్తని పొడిని గాజు సీసాలో వేసుకుని స్టోర్ చేసుకోవాలి. ఈ పొడిని పూటకు 2 గ్రాముల చొప్పున రోజుకు రెండు పూటలా నెల రోజుల పాటు తీసుకోవడం వల్ల రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ఇంకా ట్రైగ్లిజరాయిడ్స్ 20 శాతం దాకా తగ్గాయని నిపుణులు పరిశోధనల ద్వారా తెలియజేసారు.


ఈ నిమ్మ తొక్కల పొడిని నోట్లో వేసుకుని కూడా మనం చప్పరించవచ్చు. ఇంకా అలాగే మజ్జిగలో కలుపుకుని తాగవచ్చు.ఇంకా అన్నంతో మొదటి ముద్దలో కలిపి తినవచ్చు. ఇలా ఈ నిమ్మ తొక్కల పొడిని ఏ విధంగా తీసుకున్నా కూడా ఖచ్చితంగా మనం చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఇంకా అలాగే జన్యుపరంగా గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉన్నవారు, అలాగే కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరాయిడ్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నవారు  ఈ నిమ్మతొక్కల పొడిని వాడడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ నిమ్మతొక్కల పాటు దీర్ఘకాలం పాటు వాడడం వల్ల మనం ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా రక్తంలో ఉన్న కొలెస్ట్రాల్ స్థాయిలను చాలా ఈజీగా తగ్గించుకోవచ్చని ఇంకా అలాగే వీటితో పాటు మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: