“యోగా మంచిదేగా..” అని తెలుగులో ఓ పాట ఉంది. యోగా ఎంత ఆరోగ్యమో అందరికీ అర్ధమైంది. చిన్నా పెద్దా అందరూ నేడు యోగాసనాలు వేస్తున్నారు. మన దేశంలో ఎంతో ప్రాచుర్యం పొందిన యోగాను అంతర్జాతీయ స్థాయికి కూడా తీసుకెళ్లారు. సాక్షాత్తూ ఐక్యరాజ్యసమితే యోగా ప్రాధాన్యాన్ని గుర్తించి ప్రతి ఏటా జూన్ 21 వ తేదీని యోగా దినోత్సవంగా ప్రకటించింది. దీంతో చాలా దేశాల్లో యోగా ఉపయోగాన్ని గుర్తించి యోగాసనాలు ప్రారంభించారు.

విషయంలోకి వస్తే మొన్న జూన్ 21వ తేదీన ఎప్పటిలా అంతర్జాతీయ యోగా దినోత్సవం జరిగింది. ఇందులో విశేషమేముందని అనుకుంటున్నారా. ఆ విశేషమేంటే యోగా దినోత్సవాన ఓ చిన్నారి తన తండ్రితో యోగాసనాలు వేస్తూ చేసిన చిలిపి అల్లరి ఇప్పుడు వైరల్ గా మారింది. తనలా యోగా వేయాలని ఆ తండ్రి మ్యాట్ వేస్తే యోగా చేయకుండా తండ్రి యోగాసనాలు వేస్తుంటే ఆయన చుట్టూ తిరుగుతూ సందడి చేసింది. మళ్లీ యోగా మ్యాట్ వద్దకు వచ్చి తండ్రిని అనుసరిస్తూ చేసిన యోగా నెటిజన్లను విశేషంగా ఆకర్షించింది. ఈ సంవత్సరపు యోగా స్పెషల్ ఈ వీడియో అంటూ నెటిజన్లు ఆ చిన్నారి సరదాను తెగ సంబరపడుతూ షేర్ చేసుకున్నారు. ఈ వీడియో ఎక్కడిదో సమాచారం లేకపోయినా.. ఈ చిన్నారి చిలిపి అల్లరి యోగా మీకోసం..!



మరింత సమాచారం తెలుసుకోండి: