ఆదర్శ వైద్యానికి అదో మచ్చుతునక సుఖప్రసవాల నిర్వహణలో ఆ ఆస్పత్రికి సాటేదీ లేదు. అందుకే గిరిపుత్రుల పాలిట వరం ఇది. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే టాప్ మోస్ట్ లో ఒకటిగా నిలిచింది. కానీ ఇది వన్ సైడ్ ఆస్పత్రులకు వచ్చే రోగుల నాడిని పట్టుకున్నంత ఈజీగా వారి బెనిఫిట్స్ ను మింగేసిన ఘనుల ఉన్నారక్కడ.గిరిపుత్రులకు వరప్రదాయినిగా ఉన్న ఈ ఆసుపత్రికి ప్రత్యేక గుర్తింపు ఉంది. విశాఖపట్నంలోని ఏజెన్సీ ముఖద్వారమైన నర్సీపట్నంలో ఉన్నా ఎన్టీఆర్ ఏరియాసుపత్రి అత్యధిక ప్రసవాలు జరిగే ఆసుపత్రి కానే కాదు సాధారణ ప్రసవాల నిర్వహణ లోనూ ప్రశంసలు పొందుతుంది.


విశాఖ ప్రాంతంలోని అడవి పుత్రులకు ఎలాంటి అనారోగ్యాలు వచ్చినా ఈ ఆసుపత్రికే వస్తుంటారు. నర్సీపట్నంతోపాటు ఏజెన్సీ లోని చింతపల్లి, జీకే వీధి, కొయ్యూరు మండలాలకు చెందిన వారు వైద్య సేవలు పొందుతుంటారు. అందుకే అడవి బిడ్డల బాగోగుల కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి 150 పడకలతో అన్ని వసతులను ఏర్పాటు చేసింది. ఆస్పత్రికి సోలార్ వ్యవస్థ రెండు లిఫ్టర్లతోపాటు మౌలిక సదుపాయల కల్పనలో ఎలాంటి ఢోకా లేకుండా చూసింది. అంతేకాదు బేబీ కేర్ యూనిట్ తో పాటు డయాలసిస్ సౌకర్యాన్ని అందుబాటులో ఉంచారు. ఇన్ని వసతులు కలిగిన ఈ ఆసుపత్రిలో మరో కోణం కూడా వెలుగు చూడటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సౌకర్యాలూ వైద్యం అందించి ముసుగులో తెర వెనుక అవినీతి అధికారుల బాగోతం బయటపడడం గిరిజనుల పాలిట శాపంగా మారింది.

ఆ ఆస్పత్రినీ గిరిజన మహిళలు వరంగా భావించారు. అన్ని సేవలూ దొరుకుతుండటం తమ పాలిట దైవంగా కొలిచారు.కానీ అందులోనే మేకవన్నె పులులు ఉన్నాయని గుర్తించలేకపోయారు. తమ పేర్లతో కోట్లను కొట్టేసిన ఘనుల పాపం పడటంతో ఇక పీడ విరగడేనట్టేనని భావిస్తున్నారు. ఎలాంటి కల్మషంలేని మనుషులు మనసులో మరోటి పెట్టుకొని గిరిపుత్రులు ఆదుకుంటే సంతోషం ఆదుకోకపోయినా ఆనందం గానే ఉండే అడవిపుత్రులు చూస్తే అయ్యో పాపం అనిపించి అడవి బిడ్డల్ని మోసానికి గురి చేసారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు చేయించుకునే మహిళలకు జననీ సురక్షా స్కీమ్ కింద డబ్బులిస్తోంది ఇవే ఇక్కడి సీనియర్ అసిస్టెంట్ అయినా సాయి కిషోర్ కు వరంగా మారింది.

గిరిజనులు నిరక్షరాస్యులు కావడంతో వారి బలహీనతల్ని ఆసరాగా చేసుకొని ప్రసవానికి వచ్చే మహిళలకు డబ్బులివ్వకుడా తన ఖాతాల్లోకి మళ్లించుకున్నాడు.ఇలా మూడో కంటికి తెలీకుండా రెండు కోట్ల వరకూ వెనకేసాడు. కాసులకు కక్కుర్తిపడ్డ సాయికిశోర్ అవినీతిని గుర్తించని సూపరింటెండెంట్ గా చేసినా సుధాశారద కూడా అతను సిద్ధం చేసిన చెక్కులపై గుడ్డిగా సంతకాలు చేశారు. ఇవే కాదు ఆరోగ్యశ్రీ నిధులను పక్కదారి పట్టించాడు. అంతేకాదు ఓ నర్సు నుంచి కూడా లంచం తీసుకున్నాడు. ఆ సమయంలోనే ఇతని ఏసిబి పట్టుకోవడంతో ఈ ఘరానా మోసగాడి లీలలు వెలుగుచూశాయి.తీగ లాగితే డొంక కదిలినట్టు ఆడిటింగ్ లో కళ్లు చెదిరే నిజాలు వెలుగు చూశాయి.

దాంతో సాయి కిషోర్ తో పాటు పరోక్షంగా సహకరించిన సుధాశారద మీద కూడా వేటువేశారు. సొమ్మును రికవరీ చేసి కటకటాల్లోకి నెట్టారు. నిధుల గోల్ మాల్ విషయంలో సస్పెన్షన్ లతో సరిపెట్టకుండా క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ సర్వత్రా వినిపిస్తుంది. డాక్టర్ దొరపై కూడా ఆరోపణలు రావటంతో అతనని కూడా ఇంటికి పంపించారు.ఇంతటి పేరు పొందిన ఆస్పత్రిలో అవినీతి తిమింగలాలు ఉండటం విశాఖ ఏజెన్సీలో ఒక్క సారిగా కలకలానికి కారణమైంది. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు అన్నట్టుగా ఇలాంటి అవినీతిపరులపై నిత్యం ఓ కన్నేసి ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: