హాస్టల్ పేరు వింటేనే ఆ విద్యార్ధుల అదిరిపడుతున్నారు అంతలా ఆ ప్రమాదం వారి మనసులో అలజడి రేపుతోంది. కళ్ళముందు జరిగిన ఘటన కావడం తో కలవరానికి గురవుతున్నారు భయానక పరిస్థితుల మధ్య ఉండలేకపోతున్నానంటూ ఇంటి బాట పడుతున్నారు. చదువుకు వచ్చిన ఈ విద్యార్థులంతా ఇప్పుడు బిక్కుబిక్కుమంటున్నారు హాస్టల్ పేరు వింటేనే హడలిపోతున్నారు, షార్ట్ సర్క్యూట్ తో ఓ విద్యార్థి ని కోల్పోయిన చిన్నారులూ ఆ మంటల సమయంలో ఆనుభవించిన నరకాన్ని గుర్తుకు తెచ్చుకొని బెంబేలెత్తిపోతున్నారు విద్యార్దులను.


చావును దగ్గరగా చూడటం తో హాస్టల్ లో ఉండాల్సి అంటేనే వణికిపోతున్నారు. ఇటీవల ఖమ్మం లోని ఎస్సీ బాలికల హాస్టల్ లో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి గాఢ నిద్ర లో ఉండటం తో పిల్లల వెంటనే తేరుకోలేకపోయారు.  మంటలంటుకుని చెలరేగటం తో ఆ పొగతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు ప్రాణాలరచేతిలో పెట్టుకొని ఒంటి మీదున్న బట్టల తోనే బయటకు పరుగులు తీశారు. పిల్లల హాహాకారాలు విన్న చిన్న స్థానికులు కూడా వెంటనే స్పందించారు, దాదాపు గా అందరూ బయటపడాలనుకున్న క్రమం లో స్పందన రూపాంలో విషాదం నింపింది. ఆ చిన్నది మంటలు ఎక్కువ అవడంతో అందులో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయింది.  దీంతో అప్పటి నుంచి హాస్టల్ లో ఉండాలంటేనే వణికిపోతున్నారు చదువుపై కూడా శ్రద్ధ పెట్టలేకపోతున్నారు పిల్లల భయోందోళనకు గురవుతుండటంతో వారి తల్లిదండ్రు లు ఆందోళన చెందుతున్నారు.


తమ బిడ్డల చదువుల కంటే ప్రాణాలే ముఖ్యమని అంటున్నారు. ఒక్కొక్కరి గా హాస్టళ్లు ఖాళీ చేస్తూ వెళ్లిపోతున్నారు జరిగిన దారుణాన్ని గుర్తు కు తెచ్చుకొని భయంతో ఇక్కడ ఉండలేమంటూ కన్న వారికి మొరపెట్టు కుంటున్నారు. వసతి గృహంలో వంద మంది కి పైగా విద్యార్థులున్నారు వరుస సెలవులతో చాలా మంది ఇంటి కి వెళ్లగా ఇరవై ఐదు మంది మాత్రమే ఆ సమయంలో ఉన్నారు, లేదంటే ప్రమాద తీవ్రత ను ఊహించడం కూడా కష్టమే. ప్రమాదం లో కాలిపోయిన బట్టలు ట్రంకు పెట్టె లు బెడ్ లు పుస్తకాలూ ఇప్పటికీ ఆ భయానక దృశ్యాలను వారి కళ్ళకు కడుతున్నాయి. అందుకే ఆ రూమ్ ల వైపు చూడాలంటేనే భయపడుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: