స‌హ‌జంగా మనం మన ఆహారంతోపాటుగా అనుసరించే అంశాలలో నీరు తాగడం కూడా ఒకటి. అంతేకాదు  ఈ అల‌వాటు మ‌న‌లో అనేక‌ మందికి తప్పనిసరి అలవాటుగా ఉంటుంది. ఆహారం సులభంగా కడుపులోకి వెళ్ళాలన్న ఆలోచనతో నీరు తరచుగా తీసుకోవడం జరుగుతుంటుంది. అయితే నీరు ఎంత గొప్పదయినప్పటికీ, రోజులో తరచుగా తీసుకుంటున్నా కూడా, భోజనం చేసేటప్పుడు సాధ్యమైనంత తక్కువగా వినియోగింపబడాలని గుర్తుంచుకోండి. 


ఆహారం తీసుకున్న తర్వాత నీటిని తీసుకునేందుకు కనీసం అరగంట వేచి ఉండాలి. మరియు గ్లాసును మించిన మోతాదు లేకుండా చూసుకోండి. ఎందుకంటే, మన దేహం ఆహారాన్ని జీర్ణం చేసే సమయంలో ఉత్పత్తి అయ్యే ఒక నిర్ధిష్ట ద్రవం, ఘననిష్పత్తిలో ఉంటుంది. ఆహారం తిన్న తరువాత నేరుగా నీటిని సేవించినప్పుడు ఈ సంతులనం అంతరాయానికి గురవుతుంది. దీంతో ఆహారం జీర్ణం కావడానికి తీసుకునే స‌మ‌యాన్ని అస్త‌వ్య‌స్తం చేస్తుంది. దీని వ‌ల్ల ఎన్నో అనారోగ్య స‌మ‌స్య‌లు ఏర్ప‌డ‌తాయి. 


భోజ‌నం త‌ర్వాత నీరు తీసుకోవ‌డం వ‌ల్ల  సాధార‌ణం కన్నా అధిక క్యాలరీల వినియోగానికి దారితీస్తుంది. అంతేకాకుండా కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సంబంధ సమస్యలకు దారితీస్తుంది. అలాగే భోజ‌నం త‌ర్వాత నీరు తాగ‌డం వ‌ల్ల శరీరంలో ఆమ్ల స్థాయిలు పెరిగేందుకు దారితీస్తుంది. క్రమంగా గుండెల్లో మంట, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలకు కూడా దారితీస్తుంది. భోజనం తరువాత నేరుగా నీటిని తాగడం మూలంగా, పోషకాలు శోషించుకునే ఆస్కారం లేక, నేరుగా జీర్ణవ్యవస్థకు తరలించబడుతాయి. 


అందుకే భోజనం ముందు లేదా తరువాత సమయాలలో తప్ప, మిగిలిన సమయమంతా మీకు అనువుగా ఉన్న ప్రతి సందర్భంలోనూ నీటిని తీసుకోవచ్చు. తరచుగా నీటిని తీసుకోవడం మూలంగా డీహైడ్రేషన్ స్థాయిలు లేకుండా చేసి, భోజనం సమయంలో నీటిని పరిమితం చేసేలా కూడా ప్రోత్సహిస్తుంది.  కానీ రోజులో నీటిని తక్కువ మొత్తంలో సేవించేవారు, భోజనం సమయంలో అధిక నీటిని కోరుకుంటూ ఉంటారు. ఈ అలవాటు మొత్తం జీర్ణ వ్యవస్థను శిథిలం చేస్తూ, శరీర జీవక్రియల మీదనే తీవ్రమైన ప్రభావాలను చూపిస్తుంది. ఆహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో, జీర్ణక్రియ వ్యవస్థలను నిర్వహించడం కూడా అంత ముఖ్యమైనదని గుర్తుంచుకోండి.


మరింత సమాచారం తెలుసుకోండి: