పసుపు మనదేశంలో ప్రతి ఇంట్లోని వంట గదిలో ఉంటుంది. మనం తినే ఆహారానికి వినియోగించే పదార్థం ఇది. ఇక మనదేశం అనేక‌ సుగంధాలకు నిలయం. వంటల్లో తప్పనిసరిగా వాడే పసుపుతో ఇతరత్రా బోలెడు ప్రయోజనాలు ఉన్నాయనే సంగతి తెలిసిందే. అందుకే వేలాది ఏళ్లుగా భారతీయులు పసుపును ఔషధంగా ఉపయోగిస్తున్నారు. పసుపులో లభించే కుర్కమిన్ అనే పదార్థంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలున్నాయి. పసుపు టీ తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. మరి ఇన్ని గుణాలున్న ఈ పసుపుతో టీ తయారు చేసుకుని తాగితే దానివల్ల వచ్చే ప్రయోజనాలు అమోఘం. అయితే ఆ ప్ర‌యోజ‌నాలు ఏంటో ఓ లెక్కేయండి..


- పసుపు టీని చాలా తేలిగ్గా చేయొచ్చు. 3-4 కప్పుల నీటిని వేడి చేసి, 1-2 టీ స్పూన్ల పసుపు పొడిని కలపి దాదాపు పది నిమిషాలపాటు ఈ మిశ్రమాన్ని వేడి చేయాలి. తర్వాత దాన్ని గిన్నెలోకి తీసుకొని 5 నిమిషాలపాటు చ‌ల్లార‌క‌ దీనికి అల్లం ముక్క, కొంచెం తేనె కూడా కలపొచ్చు. ఈ టీని వ‌ర్షాకాలంలో తాగ‌డం చాలా మంచిది. ఎందుకంటే వ‌ర్షాకాలంలో జ‌బ్బులు ఎక్కువ‌గా వ‌స్తుంటాయి. వాటి నుంచి ఈ టీ సులువుగా ర‌క్షిస్తుంది.


- పసుపు టీ ద్వారా క్యాన్సర్ భారిన పడకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్ల్ఫమేటరీ లక్షణాలు ఆమ్ల జనకాలు క్యాన్సర్ ని తగ్గించడానికి బాగా ఉపయోగపడతాయి. అందువల్ల రెగ్యులర్ గా పసుపు టీని తాగాలి.


- కాస్త ఏజ్ ఎక్కువైతే సాధారణంగా కీళ్ల నొప్పులు వస్తుంటాయి. పసుపు టీలోని యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు ఈ నొప్పులు తగ్గడానికి బాగా ఉపయోగపడతాయి. రోజూ పసుపు టీ తాగితే కీళ్ల నొప్పుల  భారిన పడే అవకాశం తక్కువగా ఉంటుంది.


- మీ శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్స్ బయటకు పంపించే గుణాలు పసుపు టీలో అధికంగా ఉంటాయి. దీంతో బరువు తగ్గడంతోపాటు గుండె ఆరోగ్యంగా ఉండటానికి పసుపు టీ దోహదం చేస్తుంది.


- ఈ పసుపు టీ మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మీ శరీరం వ్యాధులతో పోరాడటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాగే మీలో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.


- ఇందులో ఉండే ఆమ్ల జనకాలు మధుమేహం వ్యాధిని అదుపులో ఉంచేందుకు బాగా ఉపయోగపడతాయి. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచేందుకు కూడా పసుపు టీ బాగా సహాయపడుతుంది. 


- పసుపు టీ మీ ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంంది. ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచడానికి కూడా సహాయపడుతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: