వర్షాలు ప్రారంభమయ్యాయి. ఈ కాలంలోనే జలుబు, జ్వరం, వైరల్ ఫీవర్ వంటి సమస్యలే కాక ఇన్‌ఫెక్షన్స్ చుట్టుముడతాయి. వీటిని అధిగమించాలంటే.. మన శరీరంలోని రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండాలి. వ‌ర్షాకాలంలో ప‌డే చ‌ల్ల.. చ‌ల్ల‌ని.. చిరుజ‌ల్లుల్లో త‌డ‌వ‌డ‌మంటే అంద‌ర‌కీ ఇష్ట‌మే. వ‌ర్షం ప‌డుతున్న‌ప్పుడు త‌మ‌ని తామే మ‌ర్చిపోయి మ‌రీ వాన‌పాట‌లు పాడ‌తారు. ఆ క్ష‌ణంలో త‌డిస్తే వ‌చ్చే స‌య‌స్య‌లు గురించి అస్స‌లు ప‌ట్టించుకోరు. 


నిజానికి అన్ని కాలాల క‌న్నా వ‌ర్షాకాలంలో ఇన్ఫెక్ష‌న్స్ ఎక్కువ‌గా విజృంభిస్తాయి. దీనికి కార‌ణం దోమ‌లు, బాక్టీరియా, పంగ‌స్ వృద్ధి చెంద‌డ‌మే. వ‌ర్షం వ‌చ్చే ముందు వ‌చ్చిన త‌ర్వాత కూడా గాలిలో తేమ ఎక్కువ‌గా ఉంటుంది. తేమ వ‌ల్ల చ‌ర్మ సంబంధిత రుగ్మ‌త‌లు త‌లెత్తుతాయి.. స్కిన్ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంటే, చర్మ స్ట్రెచ్ అవ్వడం, లేదా పగుళ్ళు ఏర్పడటం జరుగుతుంది. వీటిని అదిగ‌మించ‌డం ఎలానో తెలుసుకుందాం..


ప‌సుపు: పసుపులో యాంటీ ఫంగల్ యాంటీసెప్టిక్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. పసుపు కొమ్ము పచ్చిది తీసుకుని పొడి చేసి నేరుగా చర్మం మీద అప్లై చేయాలి. ఇన్ఫెక్షన్, దురద ఉన్న ప్రదేశంలో అప్లై చేసి రెండు మూడు గంటలు తర్వాత మంచి నీళ్ళతో శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజుకు రెండు మూడు సార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.


వెల్లుల్లి: ఇందులో ఉండే యాంటీ ఫంగల్ లక్షణాలు స్కిన్ ఇన్ఫెక్షన్ లక్షణాలను చాలా ఎఫెక్టివ్ గా నివారిస్తుంది. రెండు మూడు వెల్లుల్లి రెబ్బలను తీసుకుని మెత్తగా పేస్ట్ చేసి, అందులో కొద్దిగా ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి, ఇన్ఫెక్షన్ ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి. ఒక గంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.


పెరుగు: పెరుగులో ప్రొబయోటిక్స్ ఉంటాయి. ఇది ఫంగస్ గ్రోత్ నివారిస్తుంది. ఒక కాటన్ బాల్ తీసుకుని, పెరుగులో డిప్ చేసి ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయాలి. అరగంట తర్వాత వేడినీళ్లతో శుభ్రం చేసుకుని తేమను పూర్తిగా తుడిచేయాలి. ఇలా రోజుకు ఒక్కసారి చేస్తే చాలు మంచి ఫలితం ఉంటుంది.


కొబ్బరి నూనె : స్కిన్ ఫంగల్ ఇన్ఫెక్షన్ నివారించడంలో కొబ్బరి నూనె గ్రేట్ గా సహాయపడుతుంది. కొద్దిగా స్వచ్చమైన కొబ్బరి నూనె తీసుకుని, ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయాలి. రోజుకు రెండు సార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.


వెనిగర్ : బౌల్లో కొన్ని చుక్కల వెనిగర్, నీళ్ళు మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఇన్ఫెక్షన్ ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి. 15 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల స్కిన్ ఫంగల్ ఇన్ఫెక్షన్ నివారించబడుతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: