స‌హ‌జంగా చాలా మంది అధిక బ‌రువుతో చాలా ఇబ్బంది ప‌డ‌తాడు. ఎన్ని ప్ర‌యోగాలు చేసిన ఫ‌లితం ఉండ‌దు. అధిక బ‌రువు వ‌ల్ల అనేక ఆరోగ్య స‌మ‌స్య‌లు కూడా త‌లెత్తుతాయి. బరువు తగ్గాలంటే ముందుగా సరైన డైట్ పాటించడం చాలా ముఖ్యం. అలాగే తీసుకునే ఆహారం, పనిచేసే విధానం, సరైన నిద్ర మరియు విశ్రాంతి, ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయడం ఇలా అన్నిటినీ పరిగణలోకి తీసుకోవడం వలన మీ బరువును సులువుగా తగ్గించుకోవచ్చు. 


అయితే చాలామంది అనుకున్నట్లు అధిక బరువు ఉన్నవారు సులువుగా బరువు తగ్గడం అనేది అంత ఈజీ పని కాదని అంటుంటారు. అలా అనుకోవడం పొరపాటు. అలాంటి వారు అల్లం టీ తాగడం వ‌ల్ల మంచి ప్ర‌యోజం ఉంటుంది. అయితే మనకు ఎటువంటి ఖర్చు లేకుండా లభించే అల్లం టీతో సులువుగా బరువు తగ్గించుకోవ‌చ్చు. అల్లం టీని తయారు చేసుకుని అందులో తేనె గానీ, నిమ్మరసం గానీ కలుపుకుని ప్రతి రోజూ ఉదయం నోటిని శుభ్రం చేసుకున్న తర్వాత సేవించడం వల్ల‌ అధిక బరువు ఉండేవారికి సులువుగా బరువు తగ్గుతారు.


అలాగే శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను దూరం చేయడానికి అల్లం టీ బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఛాతిలో మంట, అజీర్ణం వంటి సమస్యలకు చెక్ పెట్టాలంటే అల్లం ' టీ ' తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాగే అల్లం టీని సేవించడం ద్వారా మోకాలి నొప్పులు, కీళ్ల నొప్పులు దరిచేరవు.మోకాళ్ల వాపులు కూడా అల్లం ' టీ ' రోజూ తీసుకుంటే తగ్గిపోతాయి. అలాగే ఏ అనారోగ్యంతో బాధపడేవారు అల్లం టీని సేవిస్తే ఉపశమనం లభిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: