చిన్నప్పుడు స్కూల్ డేస్ సార్ పాఠం చెప్పి మిగిలిపోయిన చాక్ పీస్ ముక్కలు అక్కడే వదిలి వెళ్తుంటే వాటిని తీసుకుని బోర్డు మీద రాసి మనం కూడా మాస్టారు అయిపోయినట్టు ఫోజులిచ్చేవాళ్ళం.  రకరకాల రంగు రంగుల చాక్ పీసు ముక్కల్ని జమచేసేవాళ్ళం. అయితే కేవలం బోర్డు మీద రాయడానికే కాకుండా, చాక్ పీస్ చాలా రకాలుగా ఉపయోగపడుతుందనే విషయం చాలా మందికి తెలియదు. వెండి వస్తువులను తుప్పు పట్టకుండా ఉండడం నుండి గ్రీసు మరకలని పోగొట్టడం వరకు చాలా పనులకు చాక్ పీస్ యూజ్ అవుతుంది.


సాస్ వేసుకుని జంక్ ఫుడ్ తినేవాళ్ళు ఎక్కడ సాస్ షర్ట్ మీద పడుతుందోనని జాగ్రత్తగా తింటారు. అయినా కూడా సాస్ షర్ట్ మీద పడుతుంది. ఇక నుండి అలాంటి భయాలేమీ పెట్టుకోకుండా హాయిగా ఫుడ్ ని ఎంజాయ్ చేయండి. ఒక వేళ సాస్ మీ షర్ట్ మీద పడితే అక్కడ చాక్ పీస్ ని రుద్ది పది నిమిషాల తర్వాత వాష్ చేస్తే సాస్ మరకలు పూర్తిగా తొలగిపోతాయి.


మనం కప్పుకునే పక్క బట్టలు,రగ్గులు వార్డ్ రోబ్ లో పెట్టడం వల్ల దుర్వాసన పెరుగుతుంది. వార్డ్ రోబ్ దుర్వాసనని పోగొట్టే ఫ్రెష్ నర్స్ ఉన్నప్పటికీ అవి హానికరమైనవి. వాటి బదులు వార్డ్ రోబ్ లో చాక్ పీస్ ని వాడితే , దానిలో ఉన్న పోరస్ వల్ల చెడు వాసనలను గ్రహించదు.


చాక్ పీస్ యొక్క ఉపయోగాలలో ఆశ్చర్యకమైన అంశం షర్ట్ కాలర్ల మీద, కఫ్ మీద ఉన్న మురికిని పోగొట్టి వాటిని తెల్లగా మెరిసేలా చేయడం. నిజానికి షర్ట్ కాలర్ మీద మురికి పోగొట్టడం చాలా కష్టమైన పని. కానీ చాక్ పీస్ ని కాలర్ ,కప్స్ పై రుద్ది  వాష్ చేయడం వల్ల ఆ మురికి తొలగిపోయి బట్టలు తెల్లగా మెరుస్తాయి.


కొత్తగా పేయింట్ వేసిన గోడలు కొన్ని రోజుల తర్వాత వాటిపై అనవసర మరకల ద్వారా వికృతంగా కనిపిస్తాయి. అలా కనిపించకుండా ఉండాలంటే వాటిపై చాక్ పీస్ ని రుద్దాలి. అలాగే గోడలలో చిన్న చిన్న పగుళ్ళు ఏర్పడినపుడు చాక్ పీస్ ని ఆ పగుళ్లలో రుద్ది ఈజీగా కనిపించకుండా చేయచ్చు.


వెండి పాత్రలు కానీ లోహాలు కానీ వాతావరణంలోని తేమ వల్ల వాటి మెరుపును కోల్పోయి నల్లగా మారతాయి. ఈ వెండి సామాగ్రిని భద్రపరిచే పెట్టెలో చాక్ పీస్ ని ఉంచడం ద్వారా అవి నల్లగా మారకుండా నిరోధించవచ్చు. అవసరం అయినపుడు చాక్ పీస్ ని మార్చుకుంటే సరిపోతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: