వాహనదారులకు జరిమానాలు విధించి .. విధించి రాచకొండ  ట్రాఫిక్ పోలీసులు అలసిపోయారో ... లేకపోతే జరిమానాలతో ప్రయోజనం నిల్ అని భావించారో తెలియదు కానీ  వాహనదారులకు జరిమానా విధించకుండా , వారికి రోడ్డు భద్రతపై  పూర్తి స్థాయిలో అవగాహన కల్పించే చర్యలు చేపట్టారు . హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడిపే  వారికి, హెల్మెట్ కొనుగోలు చేయించి వారికి  దరింపజేసి పంపిస్తున్నారు . ఇక డ్రైవింగ్ లైసెన్స్ లేనివారికి , లైసెన్స్ కోసం వెంటనే స్లాట్ బుక్ చేయించి ఇస్తున్నారు .


 ప్రతి ఒక్కరూ  ట్రాఫిక్ నింబంధనలు పాటించాలని , అందులో భాగంగానే ఎవరైతే హెల్మెట్ దరించకుండా బైక్ నడుపుతున్నారో  వారికి చలాన వేయకుండా వారిచేత హెల్మెట్ కొనిపించి దరింపచేయాలని నిర్ణయించామని , పొల్యూషన్ సర్టిఫికెట్ , ఇన్సూరెన్స్ లేనివారికి అవి వెంటనే ఇప్పించడం జరుగుతుందన్నారు. ఇక  డ్రైవింగ్ లైసెన్సు లేకుండా వాహనాలు నడుపుతున్న వారికి, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునే విధంగా  స్లాట్ బుక్ చేయించడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నామని రాచకొండ పోలీసులు  తెలిపారు. దీని వల్ల  వాహనదారులకు రోడ్డు భద్రతపై పూర్తి అవగాహన కల్పించవచ్చునని భావిస్తున్నామని   రాచకొండ పోలీసులు అంటున్నారు .


వాహనదారుల్లో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు రాచకొండ పోలీసులు  తీసుకుంటున్న చర్యలను సామాజిక మద్యం వేదికగా మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అభినందించారు . వాహనదారులకు ఎడాపెడా చలాన్లు విధించే ట్రాఫిక్ పోలీసులు , తమ వైఖరి మార్చుకుని రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు ముందడుగు వేయడం అభినందనీయమని వాహనదారులు అంటున్నారు . గతంలో సిగ్నల్ జంపింగ్ , హెల్మెట్ లేదు అంటూ ట్రాఫిక్ పోలీసులు ఇష్టారీతి లో చలాన్లు విధించే వారని చెబుతున్నారు .


చలాన్ల కు స్వస్తి చెప్పి వాహనదారులకు లేని పత్రాలు తీసుకునే విధంగా వినూత్న  చర్యలు చేపట్టడం ఆహ్వానించదగ్గ పరిణామమని పలువురు అభినందిస్తున్నారు .

 


మరింత సమాచారం తెలుసుకోండి: