సాధార‌ణంగా ఇటీవల అమ్మాయిలు మెడకు ఎలాంటి నగలను వేసుకోవడం లేదు. ఒకప్పుడు సింపుల్‌గా ఉండే బంగారు గొలుసును వేసుకునేవారు. ప్ర‌స్తుతం ఆయా వేడుకల సమయాలలో చీరల్ని కట్టుకున్నా మెడలో ఎలాంటి నగల్ని వేసుకోవడం లేదు. ఇదే ట్రెండ్‌ ప్రస్తుతం నడుస్తుంది. మెడలో గొలుసు లేకపోయినా అందంగా కనిపిస్తున్నారు. ఎందుకని ? మెడపై శ్రద్ధ పెరిగింది. మెడపై ఎలాంటి ముడతలు, మచ్చలు లేకుండా చూసుకుంటున్నారు.


ముఖానికి ఎంతటి ప్రాధాన్యతనిస్తున్నారో మెడకు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎందుకంటే మెడ మన వయసును చెప్పేస్తుంది. మ‌రి అంద‌మైన మెడ కోసం ఈ చిట్కాలు త‌ప్ప‌ని స‌రి..


తలని వెనక్కి పదిసార్లు, ముందుకు పదిసార్లు కదిలించాలి. తలని బాగా వెనుకకి వాల్చి, నోటిని బాగా తెరచి కదిలించి మూయాలి. తలని ఒక పక్క నుండి వేరొక పక్కకి కదలించాలి. తరువాత తలని కుడి భుజము తాకు వరకు తీసికెళ్లి, మళ్లీ ఎడమ వైపు భుజము వరకు తీసుకొని పోవాలి. ఇదేవిధంగా 10నుంచి 20 సార్లు చెయ్యాలి. నడిచేటప్పుడును, కూర్చునేటప్పుడునూ, తలని వెనుకకు వాల్చినట్లు ఉంచాలి.


దుమ్ము, ధూళి, ఎండ మొదలగు వాటి నుంచి శరీరమును కాపాడు కొనవలెను. ఈత నేర్చుకునేవారు ఈత తరువాత, మంచినీటిలో మళ్లీ స్నానం చేయాలి. ఉప్పు, క్లోరిన్‌ నీటి నుంచి శరీరమును కాపాడుకొనవలెను. మెడ భాగమును బిగుతు చేసే క్రీములు వాడవచ్చును. క్రీమ్‌ని పైభాగమునకు మసాజ్‌ చేయు విధంగా వాడాలి. మెడ అందంగా ఉంటే ఎలాంటి న‌గ‌లు వేసుకోక‌పోయినా అందంగా క‌నిపించ‌వ‌చ్చు.  


మరింత సమాచారం తెలుసుకోండి: