సాధార‌ణంగా బాదంను, బాదం ఫ్లావ‌ర్‌ను చాలా మంది ఇష్ట‌పడుతుంటారు.  వేసవి కాలం వస్తే చాలు జ్యూసు షాపుల్లో ఎక్కువగా బాదం పాలు అమ్ముడు పోతుంది. బాదంలో మాంసకృత్తులు, ఆరోగ్యానికి మేలు చేసే కొవ్వులు, విటమిన్లు, మినరల్స్‌ సమృద్ధిగా లభిస్తాయి. అలసటగా అనిపించినప్పుడు నాలుగు బాదాంలు తీసుకొంటే తక్షణ శక్తి సొంతమవుతుంది. అయితే గుండె పది కాలాలపాటు పదిలంగా ఉండాలంటే బాదంపప్పును మన ఆహారంలో భాగం చేసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు.


తరచూ బాదంపప్పును ఆహారంగా తీసుకోవడం వల్ల హృదయ స్పందనలు గతి తప్పడం, గుండె వైఫల్యం చెందే ముప్పు తగ్గుతుందని స్వీడన్‌కు చెందిన కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన పరిశోధకుల అధ్యయనంలో తేలింది. రోజూ 60 గ్రామలు బాదం పప్పులు తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉండి, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుందని అంటున్నారు ప‌రిశోధ‌కులు. వీటిలో మోనోశాచ్యురేటెడ్‌, పాలీశాచ్యురేటెడ్‌ ఫ్యాట్లు ఎక్కువగా ఉంటాయి.


ఇవి శరీరంలో చెడుకొవ్వు నిల్వలను నాశనం చేస్తాయి. వీటిలో పీచు పదార్థం సమృద్ధిగా లభిస్తుంది. మలబద్ధకం, ఇతర సమస్యలున్నవారు రోజుకు నాలుగైదు బాదం పప్పులు తీసుకొని.. బాగా నీళ్లు తాగితే చక్కటి పరిష్కారం దొరుకుతుంది. ఇందులో లభించే క్యాల్షియం ఆస్టియోపోరోసిస్‌ను దూరంగా ఉంచుతుంది. ఎముకలను దృఢంగా ఉంచడానికి తోడ్పడుతుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: