గోదావరి లో మరొక బోటు బోల్తా పడింది . అయితే ఈసారి ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు . ఇటీవల తూర్పు  గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చలూరు వద్ద బోటు ప్రమాదం సంభవించి , పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగిన విషయం తెల్సిందే . గల్లంతయిన వారి  మృతదేహాల కోసం ఎన్డీఆర్ ఎఫ్  బృందం గాలిస్తుండగా , గోదావరి వరద ప్రవాహం పెరగడం తో ఎన్డీఆర్ ఎఫ్ బృందం ప్రయాణం చేస్తోన్న బోటు బోల్తా పడింది . ఈ ప్రమాదం లో ఎన్డీఆర్ ఎఫ్ బృందం సభ్యులు క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు .


 ఈ నెల 15  వ తేదీన కచ్చలూరు వద్ద బోటు ప్రమాదం లో దాదాపు 77  మంది ప్రయాణం చేస్తోన్న ప్రైవేట్ బోటు ప్రమాదానికి గురయిన విషయం తెల్సిందే. ఈ ప్రమాదం నుంచి 27 మంది ప్రాణాలతో బయటపడగా , మిగతా వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి . ఇప్పటికే పలువురి మృతదేహాలను బయటకు తీసిన ఎన్డీఆర్ ఎఫ్ బృందం సభ్యులు , మిగిలిన వారి మృతదేహాల కోసం ప్రమాదం జరిగిన చోట గాలింపు చర్యలు చేపడుతుండగా , ప్రమాదం సంభవించింది . గోదావరి వరద ప్రవాహం తీవ్రంగా ఉండడం వల్లే ప్రమాదం జరిగినట్లు ఎన్డీఆర్ ఎఫ్ బృందం అంచనా వేస్తున్నారు .


 ఇటీవల కురుస్తున్న వర్షాల వల్ల గోదావరికి వరద పోటెత్తుతోన్న విషయం తెల్సిందే . గోదావరి కి తీవ్ర వరద  ప్రవాహం కొనసాగుతున్నప్పటికీ,  అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి ఈ నెల 15  వ తేదీన బోటు ప్రయాణానికి అనుమతించడం  వల్లే , బోటు ప్రమాదం సంభవించి పదుల సంఖ్యలో ప్రయాణికుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని నిపుణులు చెబుతున్నారు . అధికారులు కాసింత అప్రమత్తంగా వ్యవహరించి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదంటున్నారు ,


మరింత సమాచారం తెలుసుకోండి: