సాధార‌ణంగా శిశువుకు మొదటి ఆరు నెలలు ఇతర ద్రవ, ఘన పదార్థాలు ఏవీ ఇవ్వకుండా కేవలం తల్లిపాలు ఇవ్వాల‌న్న విష‌యం తెలిసిందే. అప్పుడే పిల్లల పెరుగుదల ఆరోగ్యంగా ఉంటుంది. అయితే ఆరు నెలల తర్వాత తల్లిపాలు మాత్రమే సరిపోవు. వారి పోషణకు, పెరుగుదలకు కావలసిన క్యాలరీలు, ప్రోటీన్ల ఆవశ్యకత పెరుగుతుంది. ఆ అవసరాలను తల్లిపాలు మాత్రమే తీర్చడం కుదరదు. కనుక ఆరు నెలల తర్వాత పిల్లలకు తల్లిపాలతో పాటు ఇతర ఆహారపదార్థాలను ద్రవ, ఘన రూపాల్లో అలవాటు చేయాలి.


పాలలో విటమిన్ సి చాలా తక్కువగా ఉంటుంది. విటమిన్ సి పిల్లలకు అందాలంటే ఆరునెలల వయసు నుంచే పండ్ల రసాలను అలవాటు చేయాలి. ఆరంజ్‌, టమాటా, ద్రాక్ష, వంటి పండ్లు మంచి పోషకాలు కలిగి ఉంటాయి. నీరు, జ్యూస్‌ నిష్పత్తి సమానంగా ఉండాలి. ఆరు నుంచి పన్నెండు నెలల పిల్లల రోజువారీ ఆహారంలో పప్పులు, గోధుమలు, పాలు, దుంపలు, ఆకుకూరలు, పండ్లు, చక్కెర, వెన్న ఉండాలి. పండ్లు దొరకని పక్షంలో ప్రత్యామ్నాయంగా ఆకుకూరల రసాన్ని సూప్‌గా చేసి, వడకట్టి ఇవ్వొచ్చు.


జ్యూస్‌, సూపుల తర్వాత మెత్తని ఆహారాన్ని 7-8వ నెలల్లో ప్రారంభించొచ్చు.  క్యాలరీస్‌ ఎక్కువగా లభ్యమయ్యే మాల్టెడ్‌ గోధుమలు, రాగులని ఈ ఆహారంలో చేర్చాలి. అలాగే కూరగాయల వల్ల విటమిన్స్‌, ఖనిజాలు లభ్యమవుతాయి. ఉడికించిన గుడ్డు పచ్చసొన కొంచెం తినిపించాలి. దానివల్ల ఎలాంటి అలర్జీ ఉండదు. గుడ్డులోని యోక్‌లో విటమిన్‌, ఐరన్‌, ప్రోటీన్లు ఎక్కువగా లభ్యమవుతాయి. గుడ్డు తెల్లసొన మాత్రం సంవత్సరం తర్వాతనే పెట్టాలి. ఎందుకంటే దీనివల్ల పిల్లలకు అలర్జీ వచ్చే అవకాశం ఉంటుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: