సాధార‌ణంగా దుస్తులు సరిగా ఎండకపోయినా, వంటింట్లో తడి ఆరకపోయినా ఒక రకమైన వాసన వస్తుంటుంది. అలాగే వర్షాలు కురిసిన ప్రతిసారీ ఇళ్లల్లోనూ తేమ చేరుతుంది. కొన్నిళ్లలో అల్మరాల్లో, గోడల్లో చెమ్మ ఏర్పడుతుంది. దీంతో ఆ దుర్వాసన బ‌ట్ట‌ల‌తో పాటు ఇల్లంతా వ్యాపిస్తుంది.  ప్రతిసారీ రసాయనాలుండే ఎయిర్‌ ఫ్రెషనర్స్‌ను వాడడం వల్ల అలర్జీ వచ్చే ప్రమాదం ఉంటుంది. అయితే వంటింటి చిట్కాల ద్వారా ఆ వాసనని ఎలా పోగొట్టొచ్చో తెలుసుకుందాం..


- బట్టలను ఉతికిన తరువాత నీళ్ళలో కొంత నిమ్మరసం కలిపి, దుస్తులను అందులో ముంచి ఆరేయాలి. అలా చేయడం వల్ల బట్టల నుంచి దుర్వాసన రాదు. అలాగే, నిమ్మరసం కలిపిన నీటితో గదులను శుభ్రపరిస్తే దుర్వాసన రాకుండా ఉంటుంది.


- బ్యాక్టీరియాని నివారించడానికి వెనిగర్‌ బాగా పనిచేస్తుంది. ఒక ఖాళీ బాటిల్‌లో పావు భాగం వెనిగర్‌ పోసి, మిగిలిన భాగం నీటితో నింపాలి. ఈ ద్రావణాన్ని ఎయిర్‌ ఫ్రెషనర్‌గా వాడుకోవచ్చు.


- ఒక గిన్నెలో వెనిగర్‌ పోసి దానిలో కొన్ని బత్తాయి, నిమ్మ తొక్కలు వేసి, వంటింట్లో పెడితే దుర్వాసన పోతుంది.


- దుప్పట్లు, కార్పెట్ల వంటివి సరిగా ఎండకపోతే వాటిపై రాత్రిపూట కొద్దిగా బేకింగ్‌ సోడా చల్లాలి. పొద్దున్నే వాక్యూమ్‌ పెడితే చాలు వాటి నుంచి వచ్చే దుర్వాసన పోతుంది.


- ఉప్పును బట్టలో మూటలా కట్టి ఇంట్లో దుర్వాసన వచ్చే చోట ఉంచితే చాలు, ఎలాంటి దుర్వాసన అయినా ద‌రిచేర‌దు.


- కొద్దిగా సోంపు, ఒక జాజికాయ, కొంచెం దాల్చినచెక్క, కొన్ని వెలుల్లి రెబ్బలు, బత్తాయి, నిమ్మ తొక్కలను ఒక గిన్నెలో వేసి, కొద్దిగా నీరుపోసి, గంటపాటు మరగబెట్టాలి. తరువాత దాన్ని చల్లార్చి, ఒక స్ప్రే బాటిల్‌లో పోసి, కావలసినప్పుడు వాడుకోవచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: