అరటి పండు అందరికి తినాలనిపించే పండు. కడుపునిండా భోజనం చేసాక అరటి పండుని ఖచ్చితంగా తింటారు. కారణం అరటి పండు అరుగుదలకు సహాయపడుతుంది కాబట్టి. అయితే ఈ అరటి పండుని షుగర్ ఉన్నవాళ్లు తినచ్చ ? అంటే తినకూడదు అనే చెప్తున్నారు వైద్యులు. వివరాల్లోకి వెళ్తే షుగర్ ఉన్నవాళ్ళు చాలామంది ఏం తినాలో ఎం తినకూడదో అని ఆందోళనకు గురవుతారు. 


ఇది ఆహారం తినకూడదు.. అది తాగకూడదు అనే నియంత్రణలు షుగర్ ఉన్నవారిని ఉక్కిరిబిక్కిరి చేసేస్తాయి. ముఖ్యంగా అరటి, ద్రాక్ష పండ్ల విషయంలో అనేక అపోహలు ప్రచారంలో ఉన్నాయి. అవి తియ్యగా ఉంటాయి కనుక మధుమేహులు తినరాదంటారు. షుగర్ ఉన్నవారు అప్పుడప్పుడు ఒకటిరెండు ద్రాక్షలను నోట్లో వేసుకుంటారేమోగానీ అరటిని మాత్రం తినరు. 


కారణం అరటిపండులో కార్బొహైడ్రేట్లు పుష్కలంగా వుంటాయి అని. ఇవి కొవ్వును ఉత్పత్తి చేస్తాయి అని. మ‌ధుమేహం ఉన్న‌వారు అర‌టి పండ్ల‌ను తింటే వారి ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు పెరిగిపోతాయి అని అంటున్నారు. మళ్లీ ఆ చక్కెర స్థాయిలు తగ్గాలంటే.. లివర్, మూత్రపిండాలపై అధిక భారం పడుతుంది కాబట్టి షుగర్ ఉన్నవారు  అర‌టి పండ్ల‌ను తిన‌క‌పోవ‌డ‌మే మంచిది అని లేకుంటే చ‌క్కెర స్థాయిలు పెరిగి త‌రువాత ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తుందని హెచ్చరిస్తున్నారు వైద్యులు. 


మరింత సమాచారం తెలుసుకోండి: