మనం ఎంతకష్టపడి వండినా సరే కొన్ని వంటకాలు ఎప్పడు రుచికరంగా ఉండవు. మనకు ఇష్టమైన వారికోసం కస్టపడి వంటలు చేస్తాము. అయినా సరే ఆ వంటలు అంత అద్భుతంగా రావు. అలాంటి సమయంలో ఈ చిట్కాలను పాటిస్తే మీరు వండిన వంటల అద్భుతంగా ఉంటాయి ఆ చిట్కాలు ఏంటో ఇక్కడ ఒకసారి చుడండి. 


టొమాటో సూప్‌ చేసేటప్పుడు క్యారెట్‌ వేస్తే పులుపు తగ్గడంతో పాటు పోషక విలువలు కూడా వస్తాయి. టొమాటోలు ఉడికించేటప్పుడు ఒక టేబుల్‌ స్పూన్‌ పంచదార, ఉప్పు కలిపితే త్వరగా ఉడుకుతాయి.


పసుపు రంగు ఆలుగడ్డలతో చిప్స్‌ చేస్తే కరకరలాడుతుంటాయి. మొక్కజొన్నపిండి చల్లి వేగిస్తే మరింత రుచి వస్తుంది.


పెరుగు, మజ్జిగ వంటివి పులిసిపోయినా.. పులుసు, చారు మొదలైన వంటకాల్లో పొరపాటున పులుపు ఎక్కువైనా కొంచెం వంటసోడా కలిపితే చాలు పులుపు తగ్గిపోయి రుచిగా మారుతాయి.


గోధుమ పిండిని గట్టిగా కలిపి పూరీలు చేస్తే పూరీలు నూనె పీల్చుకోవు. అలాగే పూరీలు కరకరలాడాలంటే బాగా మరిగించిన నూనె వేసి పిండి కలపాలి.


పరమాన్నం వండే బియ్యాన్ని కొంచెం నెయ్యి వేసి వేగిస్తే పరమాన్నం రుచిగా ఉంటుంది.


గోధుమ పిండిని గట్టిగా కలిపి పూరీలు చేస్తే పూరీలు నూనె పీల్చుకోవు. అలాగే పూరీలు కరకరలాడాలంటే బాగా మరిగించిన నూనె వేసి పిండి కలపాలి.


నిమ్మకాయల్ని పదినిమిషాల పాటు గోరువెచ్చటి నీళ్లలో వేసి పిండితే రసం బాగా వస్తుంది. ఒకవేళ నిమ్మకాయలు ఫ్రిజ్‌లో ఉంటే వాటిని బయటకు తీసిన పదినిమిషాల తరువాత రసం పిండాలి.


మరి చూశారుగా ఈ చిట్కాలను ఉపయోగించి మీరు వండే వంటలను రుచికరంగా మార్చుకోండి. 


మరింత సమాచారం తెలుసుకోండి: