వర్షాకాలం, చలికాలం వచ్చిందంటే చాలు చుండ్రు వచ్చేస్తుంది. ఎన్ని చేసిన ఈ వర్షాకాలం అంత అయినా చుండ్రు పోదు. ఈ చుండ్రు రావడానికి చాల కారణాలే ఉన్నాయి. కొంతమందికి షాంపూ కారణం అవుతే మరికొంతమందికి హెరిడీటీ బట్టి వస్తుంది. అయితే చుండ్రుకు శాశ్వతంగా గుడ్ బై చెప్పాలనుకునే వారు ఈ చిట్కాను పాటించండి. 


రెండు స్పూన్ల మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయాన్నే పేస్ట్ చేసి ఆ మెంతి పేస్ట్ ను మాడుకు బాగా పట్టించి, అరగంట తర్వాత శీకాకాయపొడితో తలస్నానం చేయాలి. తలస్నానం చేసేటపుడు చివరిగా తాజా నిమ్మరసం తలమీద అంటుకుని, నీటిని పోసుకోవాలి. ఇలా కొన్ని వారాల పాటు చేస్తే చుండ్రుకు చెక్ పెట్టచ్చు. 


రెండు చెంచాల పెసరపిండి, కప్పు పెరుగు కలిపి, తలకు పట్టించి స్నానం చేయడం వల్ల చుండ్రు సమస్యను వదిలించుకోవచ్చు. బీట్‌రూట్‌ వేరుతో సహా నీటిలో వేసి మరిగించి ఆ నీటిని మాడుకు ప్రతి రాత్రి మర్దన చేయాలి. నిమ్మరసం చుక్కలు, ఉసిరి రసం వేసి కలిపిన పుల్ల పెరుగును ప్రతిరోజూ మాడుకు పట్టించి, ఆరగంట సేపు ఉంచినా లేక రాత్రి పడుకునే ముందు పట్టించి ఉదయం నిద్ర లేవగానే తలస్నానం చేయాలి. ఈ చిట్కాలను పాటిస్తే చుండ్రు సమస్యను వదిలించుకోవచ్చు. మరి మీరు ఒకసారి ట్రై చెయ్యండి. 


మరింత సమాచారం తెలుసుకోండి: