దోమలు .. ఎక్కడికి వెళ్లిన వెంటాడి వేటాడి వాటికీ కావాల్సిన రక్తాన్ని పీల్చి రోగాలను వ్యాప్తి చేస్తాయి. ఈ దోమల కారణంగా అనవసరంగా ఆరోగ్యం పడాయి లక్షల డబ్బుని కాజేస్తాయి. మలేరియా, డెంగ్యూ జ్వరాలను తీసుకొచ్చి మనుషులను చంపుకు తింటున్నాయి. అలాంటి దోమలను చంపాలని, అవి రాకూడదని ఎంత ప్రయత్నించిన అవి పోవు. అలాంటి దోమలను సహజసిద్దంగా శాశ్వతంగా పంపేయాలనుకుంటే ఈ చిట్కాలను ఉపయోగించండి. 


కమలాపండు తొక్కల్ని ఎండబెట్టి వాటిని కాల్చితే చాలు దోమలు ఇంట్లోకి రావు 


పుదీనా వాసనకి దోమలు ఆ దరిదాపులకి రావట. అందుకే చిన్న చిన్న కుండీల్లో పుదీనా మొక్కల్ని పెంచుకుంటే మంచిది. 


దోమలు ఎక్కువగా ఉన్న చోట ఒక గిన్నెలో నీళ్ళు పోసి అందులో కర్పూరం బిళ్ళలు వేయాలి.. దీంతో దోమల బాధ తగ్గుతుంది. 


అరటి తొక్కలు మంటలో కాల్చడం వల్ల దోమలు పారిపోతాయి. 


వేపాకుల్ని ఎండబెట్టి కాల్చడం వల్ల కూడా దోమలు రావు. 


మామిడిపండు తొక్కల్ని మండిచడం ద్వారా కూడా దోమలు ఇంట్లోకి రావటానికి భయపడతాయి.


మన ఇంట్లో వాడుకునే వెల్లుల్లిపాయలను రోజుకు రెండు రేకులను కాల్చితే చాలు దోమలు రమ్మన్నా రావు. 


మరింత సమాచారం తెలుసుకోండి: