ఎప్పుడూ ఏదో పనిలో నిమగ్నమై ఉంటాం. ఏదో ఆలోచిస్తుంటాం. కానీ ప్రత్యేకమైన ఆలోచనలు ఏవి రావు. కొన్నిసార్లు ఎంత ఆలోచించినా ఏ మాత్రం ఏకాగ్రత కుదరదు. మెదడు పనితీరు, సామర్థ్యం మందగిస్తుండడమే కారణమా ? మెదడు పూర్తి ఆరోగ్యంగా ఉండి, సమర్థవంతంగా పనిచేస్తే మన ఆలోచనా శక్తి, విశ్లేషణా సామర్థ్యం పెరుగుతుంది. ఏకాగ్రత కూడా సమకూరుతుంది. వాటికీ కావాల్సిన చిట్కాలు ఏంటో ఇక్కడ చదివి తెలుసుకోండి.  


రోజూ 30 నిమిషాల పాటు శారీరక శ్రమ, వ్యాయామం చేసినవారికి మెదడు చురుగ్గా ఉంటుంది.  


బరువు తగ్గాలనుకునే వారు చాలా తక్కువగా ఆహారాన్ని తీసుకుంటారని, దానివల్ల మెదడు పనితీరు మందగించే ప్రమాదం ఉంటుంది. అందుకే శరీరానికి కావాల్సిన ఆహారం తీసుకొని వ్యాయామం చెయ్యమంటుంటారు నిఫుణులు. 


 శారీరకంగా పూర్తి ఆరోగ్యంతో ఉంటే మానసికంగానూ ఆరోగ్యంగా ఉంటారు. శరీరంలో ఏదైనా వ్యాధులు, జబ్బులు, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే అది మెదడుపై, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. 


ధూమపానం, మద్యపానం వంటి చెడ్డ అలవాట్ల వల్ల శరీరంలో రక్తనాళాలు దెబ్బతిని, హానికర రసాయనాలు చేరడంతో మెదడు పనితీరు దెబ్బతింటుంది. 


మెదడు చురుగ్గా పనిచేయాలంటే నిద్ర, విశ్రాంతి అవసరం. రోజుకు కనీసం అంటే కనీసం ఆరు గంటల నుంచి 8 గంటల వరకు నిద్ర అవసరం. 


మెదడు చురుగ్గా పనిచేయడానికి చేపమాంసం మంచిది. డిప్రెషన్‌ వంటి మానసిక సమస్యలతో బాధపడుతున్నవారు చేపలు తింటే ప్రయోజనం ఉంటుంది. 


ఏదైనా విద్యను అభ్యసించడం, ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూ ఉండడం వల్లా మెదడు ఎప్పుడూ చురుగ్గా ఉంటుంది. 


చూశారుగా.. మెదడు చురుగ్గా ఉండాలంటే ఏం చెయ్యాలి అనేది. సో మెదడు చురుగ్గా ఉండాలంటే కావాల్సినంత నిద్ర, ఆహారం సరైన సమయంలో తీసుకొని ఆరోగ్యాంగా ఉండండి.


మరింత సమాచారం తెలుసుకోండి: