సాధార‌ణంగా అందంగా క‌నిపించ‌డానికి మేక‌ప్ వేస్తుంటారు. అయితే ఇంకా అందంగా కనిపిస్తూ ఉండాలనే ఉద్ద్యేశంతో మేకప్ లో ముఖ్యంగా కనిపించే లిప్ట్సిక్ ని ఎక్కువగా వాడుతూంటారు. కానీ.. అందంగా క‌నిపించ‌డం కోసం వాడే లిప్ట్సిక్ వ‌ల్ల అనేక‌ ర‌కాల అనారోగ్య సమస్యలు వ‌స్తాయంటున్నారు నిపుణులు. కొన్ని రకాల లిప్‌స్టిక్‌ను ఎడాపెడా పెదవులపై రుద్దేస్తుండడంతో ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతోంది. ప్రస్తుతానికి లిప్‌స్టిక్‌ అందం కోసం పెట్టుకున్నప్పటికీ రాను రానూ తీవ్ర అనారోగ్యానికి దారి తీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.


చాలా మంది అమ్మాయిలు లిప్‌స్టిక్‌ను తమకు తెలియకుండానే మింగేస్తున్నారు. లిప్‌స్టిక్‌ను పెదవులపై రుద్దినప్పుడల్లా.. అది కడుపులోకి పోతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నెమ్మదిగా దాని ప్రభావం జీర్ణకోశ వ్యవస్థపై చూపుతోంది. లిప్‌స్టిక్‌ మింగిన వారికి ఇరిటేబుల్‌ వంటి ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. లిప్‌స్టిక్‌ను వాడే మోతాదు, సంఖ్యను బట్టి అనారోగ్య సమస్యల తీవ్రత ఎక్కువగా ఉంటోంది.


లిప్‌స్టిక్ వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి. కొన్ని రకాల లిప్‌స్టిక్‌ల్లో 10 పీపీఎం సీసం ఉంటోంది. ఇంతస్థాయిలో సీసం ఉంటే ప్రమాదకరం. అదే విధంగా లిప్‌స్టిక్‌ ఎక్కువగా వాడడం వల్ల నరాలకు సంబంధించిన జబ్బులు, మూత్రపిండాలు, ఎముకలు, కేన్సర్‌వంటి వ్యాధులొచ్చే అవకాశముంది. మరి కొందరికి గైనిక్‌ సమస్యలూ వస్తాయి. అలాగే ముఖ్యంగా గర్భిణులూ చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి.


లిప్ట్సిక్‌, మేక‌ప్ ప్రోడెక్ట్స్‌లో ఉండే రసాయనాల కారణంగా పుట్టే బిడ్డల్లో శారీరక కదలికలు తక్కువయ్యే ప్రమాదముందట. ఇంకా వాళ్ళు ఎదుగుతున్న ఏజ్ లో ఎన్నో సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు. అందుకే సాధ్య‌మైనంత వ‌ర‌కు లిప్ట్సిక్‌కు దూరం ఉండ‌డం చాలా మంచిది.


మరింత సమాచారం తెలుసుకోండి: