ప్రతి మనిషికి ఆధార్ కార్డ్ తప్పనిసరి అని ప్రభుత్వం ఎందుకు చెబుతుందో తెలుసా.ప్రస్తుత పరిస్దితిలో ఆధార్ కార్డ్ లేకుంటే ప్రభుత్వం ప్రవేశపెట్టే ఏ పధకాలకు ఆధార్ లేనివారు అర్హులు కాదట.అందుకే గొంతులు పగిలేలా ఆధార్ కార్డ్ తీసుకోండని, తీసుకున్న ఆధార్ కార్డ్‌ను అన్నీంటికి అంటే ప్రభుత్వ పరంగా వర్తించే ప్రతిదానికి లింక్ చేయమంటుంది.ఆధార్ లింక్ కారణం గా ఎన్నో వెసులుబాట్లు కల్పిస్తుంది.



ఆ లబ్ధిలో రైల్వేటికిట్స్ కూడ చేర్చింది. మీ ఐఆర్‌సిటిసి ఖాతాకు ఆధార్ నెంబర్ అనుసంధానం చేసినట్టయితే, నెలకు 12 రైల్వే టికెట్స్ బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నామంటున్నారు ఐఆర్‌సిటిసి నిర్వాహకులు.ఇదివరకు అమలులో ఉన్న నిబంధనల ప్రకారం..ఐఆర్‌సీటీసీ ఖాతాదారులకు నెలలో ఆరుసార్లు మాత్రమే టికెట్‌ బుక్‌ చేసుకునే వీలు ఉంది.అయితే,,ఇటీ వలే ఐఆర్‌సిటిసి తీసుకొచ్చిన సరికొత్త నిబంధనల ప్రకారం ఐఆర్‌సిటిసి ఖాతాతో ఆధార్ నెంబర్‌ను జత చేసినవారికి నెలకు 12 రైల్వే టికెట్స్ బుక్ చేసుకునే వీలు ఉంటుందట.తరచుగా ప్రయాణాలు చేసేవారికి ఐఆర్‌సిటిసి తీసుకున్న ఈ నిర్ణయంతో ఎంతో లబ్ధి చేకూరనుంది.



ఇకపోతే ఐఆర్‌సిటిసి ఖాతాతో ఆధార్‌‌ను అనుసంధానించడానికి మార్గాలు.ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్‌లోకి లాగిన్‌ అయ్యాక. .'మై అకౌంట్‌' ఆప్షన్‌‌ని ఎంచుకోవాలి.అక్కడ కేవైసీ పేజీలో ఆధార్‌ కార్డులో ఉన్న పేరు, ఇతర వివరాలను నమోదు చేయాలి..ఆ తర్వాత రిజిస్టర్డ్‌ మొబైల్‌ నెంబర్‌కు ఓటీపీ మెసేజ్ వస్తుంది.ఆ ఓటీపిని ఎంట్రీ చేసి 'అప్‌డేట్‌ ఆధార్‌' అనే ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. ఐఆర్‌సీటీసీ ఖాతాతో ఆధార్‌ నెంబర్ అనుసంధానమైందా? లేదా? అనే వివరాలు తెలుసుకోవడానికి కేవైసీ ఆప్షన్‌లో 'ఆధార్‌'ను ఎంచుకోవాలి.తరచుగా ప్రయాణాలు చేసే వారికి నెలకు ఆరుసార్లు మించితే మరో టికెట్ బుక్ చేసుకునే వీలు లేదు కనుక ఇలా ఆధార్‌ను ఐఆర్‌సిటిసి ఖాతాతో అనుసంధానం చేసుకుంటే సరిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: