ఈ మధ్యకాలంలో అందరిని వేధించే సమస్య అధిక బరువు..ఇది వయసుతో సంబంధం లేకుండా ఎంతో మందిని వేధిస్తోంది.అందుకే ఎలాగైనా బరువు తగ్గాలని వ్యాయామాలు,యోగా, డైటింగ్ చేస్తూ ఉంటారు కొందరు.ఈ నేపథ్యంలో ఎంతో ప్రాచుర్యం పొందింది కీటోడైట్.ఎంతోమంది ఈ డైట్‌ని ఫాలో అవుతున్నారు కూడా.కానీ కొవ్వులనే ఆహారంగా తీసుకుంటూ,శరీరంలోని కొవ్వులని తగ్గించే ఈ డైట్‌తో దీర్ఘకాలంలో ఎన్నో అనారోగ్యాలు వస్తాయంటున్నారు అధ్యయనకారులు.



ఈ లో హై కార్డ్,హై ఫ్యాట్ డైట్ అంటే శరీరానికి ఫ్యాట్ మాత్రమే అందే డైట్. ఈ డైట్‌తో శరీరం గ్లూకోజ్‌ను ఎంత మాత్రం తీసుకోలేదు.దీనితో శరీరం ఫ్యాట్‌ని కరిగించక తప్పని పరిస్థితి వస్తుంది.దీన్నే ఫ్యాట్‌మెటబాలిజం అంటారు.ఇక ఈ డైట్‌లో పూర్తిగా హై ఫ్యాట్ ఆహారాలు అంటే కోడిగుడ్లు,చికెన్,మటన్,చేపలు,రొయ్యలు,కిడ్నీ,లివర్,నెయ్యి,కొబ్బరి నూనె,పన్నీర్,చీజ్,వెన్న,పాలమీగడ వంటివి ఉంటాయి.ఈ డైట్‌లో ఇవే ఆహారంగా తీసుకుంటారు కాబట్టి శరీరం ఒకటి రెండు రోజుల్లోనే ఫ్యాట్ మెటబాలిజం వైపునకు మళ్లు తుంది.అప్పుడు మన శరీరంలో కొవ్వులను లివర్ కీటోన్లుగా మారుస్తుంది.అందుకే దీన్ని కీటో డైట్ అంటున్నారు.



దీనితో మధుమేహం అదుపులోకి వస్తుంది.టైప్‌టు డయాబెటీస్ తగ్గుతుంది.శక్తిస్థాయిలు పెరుగుతాయి.కానీ ఈ డైట్‌తో తీవ్ర ఆరోగ్య సమస్యల ప్రమాదం ఉంది.ఇలాంటి ఆహారంతో శరీరంలో కొవ్వు తగ్గి కీటోన్ బారీస్ తయారై వాటి స్థాయిలు పెరిగి స్పృహ తప్పటం వంటివి జరగవచ్చూ.ఇక మధుమేహానికి ఇన్సులిన్ తీసుకుంటూ ఉంటే గ్లూకోజ్ స్థాయిలు పడిపోయి తీవ్రమైన హైపో గ్లైసీమియాలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంటుంది కూడా.అలాగే కొవ్వు ఎక్కువగా తీసుకోవటం వల్ల,శరీరంలో నిల్వఉన్న కొవ్వులు ప్రోటీన్ల నుంచి శరీరం గ్లూకోజ్ తయారు చేసుకోవటం ఆరంభిస్తుంది.



ఈ క్రమంలో,యూరియా,క్రియాటినైన్,యూరిక్ యాసిడ్,పొటాషియం అన్నీ పెరుగుతాయి.ఇవన్నీ ఒక మోస్తారు వరకు మూత్రంలో వెళ్లిపోయి దుష్ప్రభావాలు ఏర్పడవచ్చు. కీటోడైట్‌ పేరుతో బరువు తగ్గినా,తరువాత సమస్య మళ్లీ మొదటికి వస్తుంది.అందుకే ఆరోగ్య నిపుణులు,ఈ డైట్ల జోలికి పోకుండా చక్కని ఆహార నియమాలు,వ్యాయామంతో కాస్త ఎక్కువ సమయం పట్టినా శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నం చేసి బరువు తగ్గండి,అంతేకాని ఇలాంటి హానికరమైన డైట్స్ జోలికి వెళ్లకండని హెచ్చరిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: