డబ్బులు సంపాదించాలంటే వయస్సుతో పనిలేదు.ఏ వయస్సులోనైన సంపాదించ వచ్చని నిరూపిస్తుంది 96 సంవత్సరాల ఈ బామ్మ..ఈ వయస్సులో క్షణం తీరికలేనంతగా బిజి అయ్యి ప్రతి వారిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.ఇంతకు ఈమె ఇంతంగా దేనిలో సంపాదిస్తుంది అనుకుంటున్నారు.అందమైన యువతులెందరో అందుకోవాలని ఆశపడి, అందుకోలేని,మోడలింగ్ రంగంలో.అవునండి నిజమే,మోడలింగ్‌‌లో ఉండే అమ్మాయిలు ఎక్కువగా పద్దెనిమిది నుంచి ముప్పై ఏళ్లలోపు వాళ్లే వుంటారు. ముప్పై పై బడిన వాళ్లలో కొద్ది మంది మాత్రమే మోడలింగ్‌‌ రంగంలో కొనసాగుతారు.కానీ హాంకాంగ్‌‌కు చెందిన ఈ బామ్మ మాత్రం 96 ఏళ్ల వయసులో మోడలింగ్‌‌ చేస్తోంది.



అలాగని ఈమె సీనియరేం కాదు.జస్ట్‌‌ మూడేళ్ల నుంచే మోడల్‌‌గా రాణిస్తోంది.మోడల్స్‌‌లో అందరికంటే ఎక్కువ వయసే అయినా చాలామందితో పోలిస్తే మోడలింగ్‌‌లో ఇంకా జూనియరే.అయితే గతంలో ఆమె ఎప్పుడూ మోడలింగ్‌‌ చేసింది లేదు.మూడేళ్ల క్రితమే అనుకోకుండా మోడల్‌‌గా మారింది. దీనికి కారణం ఆమె మనవరాలు.మోడలింగ్‌లోకి ఈమె ప్రవేశం ఎలా జరిగిందంటే మూడేళ్ల క్రితం ఆన్‌‌లైన్‌‌లో వచ్చిన ఒక ప్రకటన అందులో,65 ఏళ్లు పైబడిన మోడల్‌‌ కావాలని,ఉందట.దీంతో అలైస్‌‌ ఫొటోల్ని ఏజెన్సీకి ఆన్‌‌లైన్‌‌లో పంపించింది ఆమె మనవరాలు.అప్పుడు ఆమె వయసు 93.ఆ ఫొటోలు చూసి ఇంప్రెస్‌‌ అయిన నిర్వాహకులు అలీస్‌‌ను ఫొటోషూట్‌‌కు పిలిచారు.



మనవరాలి ప్రోత్సాహంతో అక్కడికెళ్లిన అలైస్‌‌ మొదటి షూట్‌‌లోనే మోడలింగ్‌‌ నిర్వాహకుల్ని ఆకట్టుకుంది.మోడలింగ్‌‌లో ఎలాంటి అనుభవం లేకపోయినా, తనలో ఉన్న సహజమైన అందంతో,యాటిట్యూడ్‌‌తో అందరినీ ఆకట్టుకుంది.అప్పట్నుంచి ఇప్పటివరకు కెరీర్‌‌‌‌లో వెనుదిరిగి చూడలేదు. ప్రతి చోటా ప్రొఫెషనలిజమ్‌‌తో ఆకట్టుకుంటోందట. ఇప్పుడు అలైస్‌‌ ఎంత బిజీగా మారిందంటే మూడేళ్లుగా ఈ రంగంలో పని చేస్తూ బెస్ట్‌‌ సీనియర్‌‌‌‌ మోడల్‌‌గా గుర్తింపు తెచ్చుకుని,ఆసియాలోనే అత్యంత ఎక్కువ వయసు కలిగిన మోడల్‌‌గా నిలిచింది.చూసారా కృష్ణారామ అనుకునే వయస్సులో కూడా సంపాదనలో ఎందరికో ఆదర్శంగా నిలిచిన ఈ బామ్మను ఎంత పొగిడిన తక్కువే అనుకుంటున్నారు ఈ విషయం తెలిసిన వారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: