గోళ్లు చూసి ఆరోగ్యం ఎలా ఉందో చెప్ప‌వ‌చ్చు. సాధారంణంగా పెద్దగా పట్టించుకోం అన్నమాటే కానీ ఉదయం లేచిన దగ్గర్నుంచీ ఏ పని చేయాలన్నా మనకి గోళ్లే సాయపడతాయి. గోళ్లు కేవలం మన వేళ్లకి రక్షణ, బలం మాత్రమే కాదు.. అవి మన ఆరోగ్యానికి సూచనలు కూడా. గోటి రంగుని చూసి కూడా ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. గోళ్లు కలర్ లో అయినా,  రూపంలో అయినా మార్పులు ఉన్నాయంటే వెంటనే గుర్తించాలి. ఇలాంటి లక్షణాలు అనేక ప్రాణాంతకమైన వ్యాధులకు సంకేతాలు.


చాలామంది గోళ్లను చాలా నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే  గోళ్లు లేత పసుపు రంగులోకి మారితే.. ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్ కి మాత్రమే కాదు.. థైరాయిడ్ సమస్య, ఊపిరితిత్తుల వ్యాధులు, డయాబెటిస్ కి సంకేతం.తెల్లగా తళతళలాడిపోయే గోళ్లు నిజానికి ఏమంత మంచివి కావు. శరీరంలో తగినంత రక్తం లేదన్న సూచనను ఇవి అందిస్తాయి. శరీరానికి తగినన్ని పోషకాలు అందడం లేదన్న హెచ్చరికనూ ఇవి చేస్తాయి. ఇక గుండె లేదా లివర్‌ పనితీరులో ఏదన్నా లోపం ఉన్నప్పుడు కూడా గోళ్లు పాలిపోయినట్లు కనిపిస్తాయి.


గోళ్లపై బ్లాక్ లేదా బ్లూ కలర్ లైన్స్ కనిపిస్తున్నాయంటే.. కాస్త అలర్ట్ అవ్వాల్సిందే. ఇది ఊపిరితిత్తుల సమస్య లేదా మెలనోమా లేదా స్కిన్ క్యాన్సర్ కి సంకేతం. చాలామంది ఇలాంటి సంకేతాలను నిర్లక్ష్యం చేస్తారు. కానీ నిర్ల‌క్ష్యం చేయ‌డం చాలా ప్ర‌మాద‌క‌రం.  పొగతాగేవారిలో, నెయిల్‌ పాలిష్‌ను ఎడాపెడా వాడేవారిలో కూడా గోళ్లు ఇలా పసుపురంగులోకి మారిపోతుంటాయి. మీ అలవాట్లను మానుకోమంటూ హెచ్చరిస్తుంటాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: