రాష్ట్రంలో బతుకమ్మ పండగ జోరు యమహోరుగా సాగుతుంది.ఒకవైపు ప్రభుత్వం అందమైన చీరలను ఆడపడుచులకు అందిస్తుంటే,మరో వైపు రంగురంగుల పూలతో బతుకమ్మను ఎవరైతే అందంగా పేర్చుతారో వారికి బహుమతులు ఇస్తామని బతుకమ్మ పండుగను పురస్కరించుకుని నగరంలోని చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీ వారు ప్రకటించారు.ఇక తెలుగింటి ఆడపడు చులకు బతుకమ్మను పేర్చడం ఒక కళ.



ఎంతో ఓపికగా మరింత కళాత్మకంగా బతుకమ్మను పేర్చి మురిసిపోతారు.నా బతుకమ్మ బాగుంది అంటే కాదుకాదు నా బతుకమ్మ బాగుంది అనుకుంటూ మురిసిపోతారు.అంతే కాకుండా,ఒకరిని మించి మరొకరు బతుకమ్మను అందంగా ముస్తాబు చేయటంలో పోటీలు పడతారు.ఇక బతుకమ్మను అందంగా పేర్చటం వచ్చినవారికి గుడ్ న్యూస్..మీరు ఎంత అందంగా బతుకమ్మను పేర్చితే రూ.10వేలు మీరు స్వంతం చేసుకోవచ్చు అంటున్నారు.చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీ యూనిట్ వారు..



అందమైన బతుకమ్మను పేర్చేందుకు మహిళలకు సరికొత్తగా బతుకమ్మ పోటీలను శుక్రవారం (అక్టోబర్ 4)న నిర్వహించనున్న ట్లు చిత్రమయి స్టేట్ఆర్ట్ గ్యాలరీ సోమవారం (సెప్టెంబర్ 30) న ప్రకటించింది.పోటీల్లో విజేతగా నిలిచిన బతుకమ్మకు రూ.10 వేల నగదును అందిస్తామని ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్ డాక్టర్ కె.లక్ష్మి తెలిపారు.మొదటి బహుమతి పదివేలతో పాటుగా రెండు, మూడో బహుమతిగా రూ. ఐదు వేలు,రెండువేల ఐదు వందలు అందిస్తామని పేర్కొన్నారు.మరి ఇంకెందుకు ఆలస్యం..బతుకమ్మను అందంగా పేర్చండి..రూ.10వేలను సొంతం చేసుకోండి.ఈ పోటీలో పాల్గొనాలనే ఆసక్తిగల వారు 9030904040 నంబర్‌లో సంప్రదించండి.అంటూ తెలిపారు.



ఇక మహిళలకు అత్యంత ఇష్టమైన పండుగ బతుకమ్మ.పేద,ధనవంతులు అనే తేడా లేకుండా మహిళలందరూ కొత్త బట్టలు ధరించి బతుకమ్మ ఆడడం ఆనవాయితీగా వస్తోంది.ముఖ్యంగా సద్దుల బతుకమ్మ రోజు మహిళల సందడి గురించి చెప్పాలంటే మాటలు చాలవు.ఇక బతుకమ్మను పేర్చాలంటే పూల సేకరణ నుంచి మొదలుకొని వాటిని కట్టలు కట్టడం, రంగులు అద్దడం, బతుకమ్మ పేర్చడంలో వారి పాత్ర కీలకంగా వుంటుంది.ఆడపడుచులు మరెందుకు ఆలస్యం వెంటనే బహుమతి కొట్టేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: