రంగులకీ, మనసుకీ చాలా దగ్గర సంబంధం ఉంది. మనం ఇష్టపడే రంగు మన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంద‌ని అంటారు. అయితే ఒక్కోక్కరికి ఒక్కో రకం రంగు ఇష్టం. కానీ ఈకాలం యూత్‌ పిల్లల్లో ఎవ్వరినైనా నీకే రంగు ఇష్టం అని అడిగితే చాలా వరకు నలుపంటే ఇష్టం అని సమాధానమొస్తుంది. మరికొందరిలో తెలుపు ఇష్టం అని మరి అమ్మాయిలైతే ఎక్కువగా పింక్‌ ఇష్టం అని ఇలా చెప్తుంటారు. అయితే నలుపు రంగు అన్ని రకాల కాంతి కిరణాలను ఇముడ్చుకొని, ఏ విధమైన కిరణాలను కూడా పరావర్తనం చెందించదు.


అందువలన ఏ రంగు వర్ణకాలైనా ముదిరినప్పుడు చివరకు నలుపు రంగులోకి మారుతుంది. అయితే  నలును అందమైనవే కాదు, శక్తిమంతమైనది కూడా. హోదాకి, హుందాకి చిహ్నం నలుపు రంగు. దీన్ని ఇష్టపడేవాళ్లు చాలా కాలిక్యులేటెడ్‌గా ఉంటారు.  ఏ పనయినా ఏకాగ్రతతో సమగ్రంగా చేస్తారు. ఈ రంగు ఇష్టపడే వ్యక్తులు స్వతంత్రంగా ఉండాలనుకుంటారు. ఆధిపత్యాన్ని వ్యతిరేకి స్తారు, కానీ తమ దగ్గరికి వచ్చేసరికి అదే ఆధిపత్యాన్ని కోరుకుంటారు.


ఎలాంటి సందర్భాలలో అయినా సరే తమని తాము కంట్రోల్‌లో ఉంచుకుంటారు. ఎదుటివారిని కచ్చితంగా అంచనా వేయగలరు. భావావేశాల్ని నియంత్రిచుకోగల శక్తి ఎక్కువే. అంత ఈజీగా బయట పడరు. దీనివల్ల కొన్నిసార్లు ముఖ్యమైన సంబంధ బాంధవ్యాలు వదులుకునే పరిస్థితి వస్తుంది. అందరితో త్వరగా కలిసిపోతారు. కొత్తగా వచ్చిన ట్రెండ్స్‌ను ఫాలో అవడం అంటే వీరికి చాలా ఇష్టం.


మరింత సమాచారం తెలుసుకోండి: