రెండేళ్ళు నిండిన పిల్లలు అప్పుడప్పుడే వారి జీవితం ప్రారంభమవుతుంది. అప్పుడే బడికి వెళ్లడం ప్రారంభమవుతుంది. అయితే వారు తీసుకునే ఆహారం విషయంలో పెద్దలు ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే రెండేళ్ల పిల్లల విషయంలో పెద్దలు తప్పక తీసుకోవాల్సిన ఆహార జాగ్రత్తలు గురించి నిపుణులు చెప్పిన సలహాలు ఇక్కడ చదివి తెలుసుకోండి.. 


రెండేళ్లు నిండిన పిల్లలకు స్వయంగా వారే కలుపుకొని తినే విధంగా అలవాటు చేయాలి.


పిల్లల్ని టీవీ చూస్తూ భోజనం చేయనివ్వకూడదు. సౌకర్యంగా కూర్చొని భోజనం చేసేలా అలవాటు చెయ్యాలి.


కొత్తగా బడిలో చేరుతున్న పిల్లలకు లంచ్ బాక్స్ ఎలా విప్పాలి, ఎలా తినాలి వంటి అంశాలమీద ముందు నుంచే చెప్తూ ఉండాలి. 


పిల్లలకు పాలు, పండ్లు, గింజలతో కూడిన అల్పాహారం రోజూ క్రమం తప్పకుండా అందించాలి. 


బడి నుంచి ఇంటికి వచ్చాక ఉడికించిన గుడ్డు, గింజలు, ఆమ్లెట్, పల్లీలు, పండ్లు వంటివి చిరుతిండిగా అందించాలి.


పిల్లలకు డబ్బాలలో నిల్వ ఉంచిన రెడీమేడ్ ఆహారానికి బదులు పాలు, పాల ఉత్పత్తులు, పండ్లు వంటివి ఇవ్వడం మంచిది.


బరువు పెరుగుతారనే అపోహను పక్కన బెట్టి పిల్లల ఆహారంలో తగినంతగా వెన్న, నెయ్యి వంటివి ఉండేలా చూసుకోవాలి.


పిల్లలు రోజూ 5 నుంచి 8 గ్లాసుల మంచినీరు తాగేలా చూడటంతో పాటు రోజుకు కనీసం 45 నిమిషాలు ఆడుకునేలా చూడాలి.


పిల్లల ఆహారం విషయంలో ఎలాంటి సమస్య వచ్చినా పోషకాహార నిపుణుల సలహా తప్పక తీసుకోవాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: