వాస్తు.. మనం ఎక్కడ ఉన్న మన వాస్తు బాగుందా ? లేదా అనేది తప్పకుండ చూసుకుంటాం. మనకు ఏదైనా చేదు అనుభవం కారణం వాస్తు వల్ల జరిగింది అని మనం ఆలోచిస్తాం. అందుకే గృహ నిర్మాణం సమయంలోనే వాస్తు సరిగ్గా ఉండేలా చూసుకుంటాం. వాస్తు మంచిగా ఉంటే మనకు మనశాంతి కలుగుతుంది అని చెప్తుంటారు బ్రాహ్మణులు. 


ఇంకా విషయానికి వస్తే.. బెడ్ రూమ్‌లో పుస్తకాలు పెట్టుకోవడం కోసం అలమారను కేటాయిస్తాం. కానీ బెడ్ రూమ్ లో పుస్తకాలు ఉండటం మంచిది కాదని చాలామంది మనకు చెప్తుంటారు. కానీ అది ఏ మాత్రం నిజం కాదు. ఫెంగ్ షుయ్ ప్రకారం బెడ్ రూమ్ లో పుస్తకాలు ఉంటె ఏ మాత్రం చెడును కలిగించవు. ఇంకా ఆ పుస్తకాల వల్ల మనకు మంచే జరుగుతుంది. 


నిద్రించేందుకు ముందు కొంతసేపు పుస్తకాలను చదవడం మంచిదే. ముఖ్యంగా ప్రేమకు సంబంధించిన పుస్తకాలు.. మహాత్ముల జీవిత కథలకు సంబంధించిన పుస్తకాలు చదవడం చాల మంచిది. అయితే నిద్రించేందుకు ముందు పుస్తక అలమరాలను మూతపెట్టడం మంచిది. పుస్తకాలు పడకగదిలో మూతపెట్టే షెల్ఫ్‌ల్లో ఉండటం ద్వారా మంచి శక్తినిస్తుందని ఫెంగ్ షుయ్ నిపుణులు అంటున్నారు. 


కాగా పుస్తకాల చదవడం ద్వారా మాములుగా మానసిక ప్రశాంతత లభిస్తుందని.. ఇంకా ఉన్నతమైన పుస్తకాలను నిద్రించేందుకు ముందు చదవడం ద్వారా మనలో పాజిటివ్ శక్తులు పెరుగుతాయని ఫెంగ్‌షుయ్ శాస్త్రవేత్తలు అంటున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం. మంచి పుస్తకాలను తెచ్చుకొని అప్పుడప్పుడు చదువుతూ ఉండండి.


మరింత సమాచారం తెలుసుకోండి: