ఆరోగ్యమైన శిశువు కోసం అన్ని కలిసిన పౌస్టికాహారము అనగా ఎక్కువపాలు, పండ్లు, ఆకుకూరలు, పప్పు, మాంసము, చేపలు వగైరా తీసుకోవ‌డ‌మే కాక అనేక జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. ప్రస్తుత కాలంలో గర్భిణులు ఎదుర్కొనే సమస్యలు అన్నీ ఇన్నికావు. తొమ్మిది నెలలు అగ్నిపరీక్షే. అందుకే త‌గు జాత్ర‌త్తుల త‌ప్ప‌ని స‌రిగా తీసుకోవాలి. గర్భిణులు కంటినిండా నిద్రపోవటం ఎంతో అవసరం. అయితే గర్భిణులు మూడో నెల నుండి ఎడమ వైపు తిరిగి పడుకోవాలి.


ఎక్కువసేపు వెల్లకిలా పడుకోకుండా చూసుకోవాలి. పగలు సాధ్యమైనంత ఎక్కువగా ద్రవాలు తీసుకోవాలి. అయితే రాత్రిపూట వాటిని పరిమితం చేయాలి. లేకపోతే ఎక్కువసార్లు మూత్రవిసర్జన నిద్రలేమికి దారితీస్తుంది. రాత్రులు 8-10 గంటలు, పగలు 1 గంట నిద్ర లేదా విశ్రాంతి తీసుకోవాలి . కారం తక్కువగా ఉండే పదార్థాలు తినాలి. పిండం ఎదుగుదలకు ప్రోటీన్స్‌లు దోహదం చేస్తాయి. మొదటి మూడు నెలలు గర్భిణులకు ఎంతో కీలకమైనవి. జీర్ణశక్తికి తగ్గట్టు ఎక్కువగా ద్రవ పదార్థాలు తీసుకోవాలి.


శక్తిని అందించే పాల ఉత్పత్తులు తీసుకోవాలి. గర్భస్థ శిశువుకు రక్తం వృద్ధి కావడానికి, మెదడు బలోపేతం కావడానికి ఎంతో తోడ్పాడుతాయి. గొర్రె మాంసం, లివర్‌, చికెన్‌, బీన్స్‌, చిరుధాన్యాల్లో ప్రోటీన్స్‌ అధికంగా ఉంటాయి. దంతాలు, ఎముకలు, కండరాలు, నరాల శక్తికి కాల్షియం ఎంతో తోడ్పడుతుంది. అంతేకాకుండా గుండె సరిగ్గా పనిచేయడానికి కాల్షియం చాలా అవసరం. దీన్ని గర్భిణులు తగిన మోతాదులో తీసుకోవాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: