కాలం మారుతుంది కాలంతో పాటు మనుషులు మారుతున్నారు.వాటితో పాటు సౌకర్యాలను కూడా సౌకర్యవంతంగా పొందుతున్నాడు.కాలంతో పాటు పరిగెత్తుతున్న మనిషి ఎన్నో కొత్త కొత్త వాహనాలను కనిపెడుతున్నాడు.ఇప్పుడు పెట్రోల్, డిజిల్‌తో పని లేకుండా,పర్యావరణానికి నష్టం వాటిల్లకుండా సరొకొత్త వాహనం ఎలక్ట్రికల్ కారును తయారు చేసాడు.



ఈ కారును వ్యాపార దిగ్గజం అయిన టాటా మోటార్స్‌ 2019-20 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో నెక్సాన్‌ ఇవితో వ్యక్తిగత విద్యుత్‌ వాహన విభాగంలోకి అడుగుపెడుతు ఈ మోడల్ కారును విడుదల చేస్తున్నారు.అని కంపెనీ ప్రకటించింది.ఇటీవల ప్రవేశపెట్టిన జిప్‌ట్రాన్‌ టెక్నాలజీని ఇందులో ఉపయోగిస్తున్నారు.



వచ్చే మార్చి త్రైమాసికం నుండి భారతదేశంలో వ్యక్తిగత కొనుగోలుదారులకు నెక్సాన్‌ ఇవి లభిస్తుందని ప్రకటించడం తమకు గర్వంగా ఉందని టాటా మోటార్స్‌ లిమిటెడ్‌ ఎలక్ట్రిక్‌ మొబిలిటీ అండ్‌ కార్పొరేట్‌ స్ట్రాటజీ ప్రెసిడెంట్‌ శైలేష్‌ చంద్ర పేర్కొన్నారు. ఇది ఉత్తేజదాయక ఆన్‌ రోడ్‌ పనితీరును అందిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. సున్నా ఉద్గారాలకి భరోసా ఇస్తుందన్నారు.ఈ ఇవితో సుమారు 300 కిలోమీటర్ల దూరం వెళ్ళవచ్చన్నారు.



అత్యాధునిక జిప్‌ట్రాన్‌ టెక్నాలజీతో నడిచే నెక్సాన్‌ ఇవిలో సమర్థవంతమైన హై వోల్టేజ్‌ సిస్టమ్‌, జిప్పీ పనితీరు, ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సామర్ధ్యం, బ్యాటరీ మరియు మోటారు 8 సంవత్సరాల వారంటీ, ఐపి 67 (డస్ట్‌ అండ్‌ వాటర్‌ ప్రూఫ్‌ ) ప్రామాణికాలుగా ఉన్నాయన్నారు.దీని ధర రూ.15లక్షల నుంచి రూ.17 లక్షల మధ్య ఉండొచ్చని చెప్పుకొచ్చారు.ఇక ప్రస్తుత ఈవీ విపణిలో ఎదురవుతున్న ఇబ్బందులకు ఈ మోడల్‌ ఒక సమాధానంగా నిలుస్తుంది.ఈ సందర్భంగా తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: